టీజ‌ర్‌ టాక్ : మ‌ల‌యాళీ వీరత్వం చూశారా

Update: 2019-10-04 08:31 GMT
పాన్ ఇండియా ట్రెండ్ అంత‌కంత‌కు ఊపేస్తోంది. బాహుబ‌లి-సాహో-సైరా న‌ర‌సింహారెడ్డి.. ఇలా భారీ చిత్రాలు వ‌రుస‌గా వ‌చ్చి సౌత్ లో ఉత్సాహం పెంచాయి. ఇదే హుషారులో అటు మ‌ల్లూవుడ్ లో కూడా భారీ ప్ర‌య‌త్నాలే సాగుతున్నాయి. అక్క‌డ మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టించిన మ‌మాంగం తెలుగు-మ‌ల‌యాళం-హిందీలో నవంబర్ 21న  గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. అందుకే ప్ర‌చారంలోనూ వేగం పెంచింది టీమ్. తాజాగా మ‌మాంగం టీజ‌ర్ రిలీజైంది.

జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. మమ్ముట్టి ఓ యుద్ధ వీరుడిగా ప్ర‌త్యేక క‌ళ‌ల్లో ఆరితేరిన వాడిగా క‌నిపించ‌నున్నారు. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపిస్తున్నారు. క‌త్తి యుద్ధంతో పోలిస్తే ఇది చాలా విభిన్న‌మైన‌ది. వేగ‌వంత‌మైన‌ది. ఏడీ 1695 నేపథ్యాన్ని టీజ‌ర్ లో చూపిస్తున్నారు. అంటే 16వ శ‌తాబ్ధంలో చ‌రిత్ర‌కు సంబంధించిన విష‌యాల్ని తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మే ఇది.  జమోరిన్ ని చంపిన చావేర్స్ కథే ఈ సినిమా. మ‌మ్ముట్టి ఈ సినిమాలో ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో కనిపిస్తారు. ఒక 12 ఏళ్ల చిన్నారి బాల‌కుడు టీజ‌ర్ లో చ‌క్క‌ని యాక్షన్ తో అల‌రిస్తున్నాడు. అత‌డి పాత్రా ప్ర‌త్యేక‌మైన‌దేన‌ని అర్థ‌మ‌వుతోంది. టీజ‌ర్ ఆద్యంతం భారీ కోట సెట్టింగులు... లైటింగ్ స్కీమ్.. రీరికార్డింగ్ ఆక‌ట్టుకుంది.

శామ్ కౌశల్ యాక్ష‌న్ .. ఆర్.సి. కమలకన్నన్ వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ చేస్తున్నారు. టీజ‌ర్ కి ఎం. జయచంద్రన్ రీరికార్డింగ్ ప్ర‌ధాన బ‌లంగా క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా బీజీఎం అందించారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మమ్ముట్టి- ప్రాచి తెహెలన్‌- ఉన్ని ముకుందన్- మోహన్ శర్మ తదితరులు న‌టిస్తున్నారు.


Full View


Tags:    

Similar News