మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి భారీ ప్రయోగం గురించి తెలిసిందే. ఆయన నటించిన హిస్టారికల్ మూవీ `మమాంగం` తెలుగు- తమిళం- మలయాళం- హిందీలో డిసెంబర్ న12న అత్యంత భారీగా రిలీజవుతోంది. ఇప్పటికే టీజర్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. సినిమా ఆద్యంతం కలరి విద్యలో మమ్ముట్టి సహా వీరుల పోరాటాలు ఉత్కంఠ రేపనున్నాయని టీజర్ చూస్తే అర్థమైంది. రొటీన్ కి భిన్నంగా నాటి వాతావరణాన్ని ఎలివేట్ చేస్తూ తెరకెక్కించడం ఆసక్తికరం. శతాబ్ధాల నాటి కేరళ సంస్కృతిని ప్రతిబింబిస్తూ రూపొందించారు. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో తీసిన చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. హిస్టరీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారు. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారని.. 1695వ సంవత్సరంలో జరిగిన ఒక నిజమైన కథతో.. ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి విజువల్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలిపారు.
మమ్ముట్టికి తెలుగులో మోహన్ లాల్ స్థాయి ఫాలోయింగ్ అయితే లేదు. మమాంగం ఆ లోటును తీరుస్తుందేమో చూడాలి. ఈనెల 3న మమాంగం ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇదే నెల 13న సినిమా రిలీజ్ కానుంది. మమ్ముట్టి పాన్ ఇండియా ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాన్ని ఇవ్వనుంది అన్నది చూడాలి.