ఈ సోయగాలకు 'మందిర'మే కరెక్ట్

Update: 2018-02-21 10:40 GMT
మందిరా బేడీ అంటే తెలియని టెలివిజన్ ప్రేక్షకులు.. క్రికెట్ ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. సీరియల్స్ లో యాక్ట్ చేసింది కాబట్టి టీవీ ఆడియన్స్ కు తెలిసింది.. అడపాదడపా సినిమాలు చేసింది కాబట్టి వారికీ దగ్గరైంది. వీటన్నిటి కంటే ఎక్కువగా అప్పట్లో సెట్ మ్యాక్స్ ఛానల్ లో ఎక్స్ ట్రా ఇన్నింగ్స్ అంటూ చిట్టిపొట్టి బట్టలతో మందిర చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

అప్పట్లో అటు క్రికెట్ సిరీస్ లతో పాటు.. ఈమె డ్రెసింగ్ లకు అంత క్రేజ్ ఉండేది. ఇదంతా ఓ 15 ఏళ్ల క్రితం సంగతి అయినా.. ఇప్పటికీ అదే సోయగాలను మెయింటెయిన్ చేస్తోంది మందిరా బేడీ. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 45 సంవత్సరాలు అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పైన ఫోటోలో కనిపిస్తున్న అందాలకు అంత వయసు ఉందా.. ఆ ఏజ్ లో ఇంతలా అందాల ప్రదర్శన చేస్తూ టూపీస్ బికినీ వేసిందా.. ఇంత వయసు వచ్చినా బాడీ ఫిట్నెస్ ఇంతగా కాపాడుకుందా అని ఎన్ని రకాలుగా ఆశ్చర్యపోయినా.. ఈ సోయగాలు ఆ మందిరానివే.

అటు ఫిట్నెస్ ను మెయింటెయిన్ చేయడమే కాదు.. ఈ తరహా పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా మందిరకు మహా ఇష్టమైన విషయం. ఇక ఈ సీనియర్ భామ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న సాహో చిత్రంలో కీలక పాత్రలో నటించేస్తోంది. మరి ఈ సినిమాలో కూడా అందాలు పరుస్తుందా అంటే.. అప్పుడే చెప్పలేం.
Tags:    

Similar News