గతానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు.. పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి. గతంలో కొన్ని విషయాల్లో సిగ్గుపడటం.. విషయాల్ని దాచి పెట్టటం లాంటివి చేసే వారు. ప్రముఖులు అయితే మరీనూ.
ఇప్పుడు ఆ హద్దుల్ని చెరిపేయటమే కాదు.. సగర్వంగా తమకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాల్ని షేర్ చేసుకుంటున్నారు ప్రముఖులు. 51 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్న ఆనందకర క్షణాల్ని షేర్ చేసుకున్నారు బాలీవుడ్ నటుడు మనోజ్ తివారి. ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
1999లో రాణి తివారిని పెళ్లాడిన మనోజ్ కు ఒక పాప పుట్టింది. ఆ తర్వాత వారు 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన సురభిని పెళ్లాడారు. వీరికి 2020లో ఒక పాప పుట్టింది. కట్ చేస్తే.. తాజగా మరోసారి సురభి గర్భం దాల్చారు. తాజాగా ఆమె సీమంతం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న వేళ.. ఆయనకు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక.. ఆయన పంచుకున్న వీడియో ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. ఆయన అనుభవిస్తున్న ఆనంద క్షణాల్ని కళ్లకు కట్టినట్లుగా తెలియజేసేలా వీడియో ఉందని చెప్పాలి.
ఆయన పేర్కొన్నట్లు.. 'కొన్ని సంతోషకరమైన క్షణాల్ని మాటల్లో చెప్పటం.. ఈ ఆనందం కలకాలం అలానే నిలిచిపోతుందని భావిస్తున్నా' అన్న వ్యాఖ్య నిజం కావాలని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View