కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ''మాస్టర్'' తమిళ తెలుగు భాషల్లో జనవరి 13న విడుదల కాబోతుండగా.. హిందీలో మాత్రం జనవరి 14న విడుదల కానుంది. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అవుతూ వస్తోంది. అయితే ఇంకొన్ని గంటల్లో 'మాస్టర్' ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకుంటుండగా.. ఇప్పుడు ఈ చిత్రానికి లీకుల తిప్పలు తప్పలేదు. ఆదివారం అర్ధరాత్రి నుంచే సినిమా ఇంటర్వెల్ సీన్స్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి నుంచి ఈ సినిమా నుంచి చిన్న చిన్న క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'మాస్టర్' చిత్ర యూనిట్ దీనికి దిద్దుబాటు చర్యలను చేపట్టింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ సహా సినీ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 'ఈ సినిమా చాలా మంది సాంకేతిక నిపుణులు, నటీనటులు ఏడాదిన్నర పడ్డ కష్టం. దాన్ని థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేస్తే బావుంటుంది. ఆన్ లైన్ లో లీక్ అయిన క్లిప్స్ ను దయచేసి షేర్ చేయకండి. ఓ రోజు మాత్రమే ఉంది. సినిమాను థియేటర్స్ లో చూద్దాం' అని లోకేశ్ కనకరాజ్ రిక్వెస్ట్ చేశాడు. ప్రొడ్యూసర్స్ దీనిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేస్తూ ఎవరైనా వీడియోలు లీక్ చేసినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. హీరోయిన్ - మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా దీనిపై పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా 'మాస్టర్' సినిమా క్లిప్పింగ్స్ లీక్ చేసిన వారిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ సర్వీస్ ప్రొవైడర్ ని మూసివేయడంతో పాటు చర్యలు తీసుకోడానికి సిద్ధమయ్యారు.