ఎనిమిది నెలలుగా కోవిడ్ మహమ్మారీ అన్ని పరిశ్రమల్ని గజగజ ఒణికించింది. ముఖ్యంగా వినోదపరిశ్రమ పుట్టి ముంచింది. వందల కోట్ల నష్టాలకు కారణమైంది. ఇప్పటికీ కోవిడ్ ప్రభావానికి ఝడిసి సినిమాల్ని రిలీజ్ చేసేందుకు బడా హీరోలు ఎవరూ ముందుకు రావడం లేదు. భారీ పెట్టుబడులు వెదజల్లి నిర్మించిన సినిమాల్ని రిలీజ్ చేయాలంటే కలెక్షన్స్ విషయంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనా నెలకొంది.
50 శాతం సీటింగ్ సగం కలెక్షన్లతో రిటర్నులు అసాధ్యం అన్న భావన నెలకొంది. ఇలాంటి సమయంలోనే కిలాడీ అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ క్రేజీ హీరో సినిమా లక్ష్మీ.. సౌత్ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రాలు ఓటీటీల్లో రిలీయ్యాయి. చాలా క్రేజీ సినిమాల్ని థియేట్రికల్ రిలీజ్ మర్చిపోయి ఓటీటీల్లోనే రిలీజ్ చేశారు.
అయితే ఓ తమిళ మాస్ హీరో మాత్రం థియేట్రికల్ రిలీజ్ కి తన సినిమాని సిద్ధం చేస్తూ వేడి పెంచుతున్నాడు. భారతదేశంలో నెక్స్ట్ బిగ్ ఫిల్మ్ సెన్సార్ ఫార్మాల్టీస్ పూర్తవుతున్నాయి. ఇలయదళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ గురించే ఇదంతా. ఈ సినిమాకి సీబీఎఫ్ సీ సర్టిఫికేషన్ పూర్తవుతోంది.
లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన `మాస్టర్` 2021 సంక్రాంతి సీజన్లో థియేటర్లలోకి రానుంది. ఆ మేరకు రిలీజ్ ని ఖాయం చేశారు. ప్రస్తుత సన్నివేశంలో కోవిడ్ కి దానివల్ల పుట్టుకొచ్చిన కొత్త రూల్స్ కి అదరక బెదరక దళపతి బరిలో దిగిపోతుండడం ఆశ్చర్యపరుస్తోంది. మాస్టర్ తో పాటు భారీ క్రేజీ సినిమాల్ని సంక్రాంతి బరిలో దించే ఆలోచన ఉన్నా అప్పటికి ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. ప్రస్తుత క్రైసిస్ లో టిక్కెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ఉంది కాబట్టి క్రేజీ హీరోల సినిమాలు రిలీజయ్యే వీలుంటుందని భావిస్తున్నారు.