హీరోయిన్ గా మొదటి చాన్స్ రావడమే గగనంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది మొదటి సినిమా విడుదల కాకుండానే వరుసగా ఆఫర్లు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కొందరు హీరోయిన్స్ మూడు నాలుగు సినిమాలు విడుదల అయిన తర్వాత కాని సక్సెస్ ట్రాక్ ఎక్కి బిజీ అవ్వరు. అలాంటిది ఇటీవల ఉప్పెన సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి మొదటి సినిమా విడుదలకు ముందే రెండు మూడు సినిమాలు కమిట్ అయ్యింది. ఉప్పెన విడుదలైన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపుగా అరడజను సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే తరహాలో మరో హీరోయిన్ కూడా మొదటి సినిమా విడుదలకు ముందే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది.
అక్కినేని కుటుంబ హీరో సుశాంత్ నటించిన 'ఇచట వాహనాలు నిలుపరాదు' సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఈ లక్కీ బ్యూటీ మొదటి సినిమా విడుదల కాకుండానే రవితేజ ఖిలాడీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. మొదటి రెండు సినిమాలు విడుదలకు ముందే మూడవ సినిమా కూడా సైన్ చేసింది.
ఇటీవలే ప్రారంభం అయిన 'హిట్ 2' లో అడవి శేషుకు జోడీగా ఈ అమ్మడు ఎంపిక అయ్యింది. నాని నిర్మిస్తున్న ఈ సినిమా కు మంచి బజ్ ఉంది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం దక్కడంతో ఇది విడుదల కాకుండా కూడా ఈమెకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో మరో లక్కీ బ్యూటీగా మీనాక్షి పేరు మారు మ్రోగి పోతుంది. ఈ మూడు సక్సెస్తె అయితే ఖచ్చితంగా తెలుగులో ఈ అమ్మడు టాప్ స్టార్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.