'బ్రహ్మాస్త్ర' లో పవర్ ఫుల్ రోల్ లో ఆలియా..!

Update: 2022-03-15 06:42 GMT
బాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ''బ్ర‌హ్మాస్త్ర'' ఒకటి. రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బ‌చ్చ‌న్ - మౌనీరాయ్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూపొందుతోంది.

కింగ్ అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ త‌ర్వాత ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'బ్ర‌హ్మాస్త్ర' చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు.

''బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్: శివ'' పేరుతో మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన రణబీర్ ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

 ఈ క్రమంలో నేడు హీరోయిన్ అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పాత్రను పరిచయం చేయడంతో పాటుగా విజువల్స్ తో కూడిన ఫస్ట్ లుక్ ని రివీల్ చేసారు.

ఈ సందర్భంగా నాగార్జున ట్వీట్ చేస్తూ.. 'బ్రహ్మాస్త్ర యొక్క మొట్టమొదటి విజువల్స్ తో ఆలియా లుక్ ని షేర్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చారు. 'బ్రహ్మాస్త్ర' సినిమాలో ఈషా పాత్రలో అలియా కనిపించనుందని.. బ్రహ్మాస్త్ర శక్తి అని మేకర్స్ పేర్కొన్నారు. విజువల్ వండర్ గా ఉన్న ఈ వీడియోలో అలియా ఎంతో అందంగా కనిపిస్తోంది.

సూపర్ నేచురల్ పవర్స్ కలిగియున్న రణబీర్ తో పాటుగా ఆమె పాత్ర కూడా కథలో కీలకమని అర్థమవుతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న అలియా.. 'బ్రహ్మాస్త్ర' సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.

ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సెప్టెంబ‌ర్ 9న (09.09.2022) గ్రాండ్‌ గా రిలీజ్ చేయనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ - ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Full View
Tags:    

Similar News