దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వరుస కమిట్ మెంట్ల గురించి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అనంతరం అతడు మహేష్ తో భారీ పాన్ ఇండియా సినిమా కోసం పని చేస్తారు. ఈ గ్యాప్ లో బాలీవుడ్ హీరోతో సినిమా చేస్తారని ప్రచారమైనా కానీ అది వీలు పడలేదు. రాజమౌళి ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నారు. ఈలోగానే ఆయన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పని చేసేందుకు గీతా ఆర్ట్స్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి బన్నీతో ప్రాజెక్ట్ ఆలోచన ఇప్పటిది కాదు. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మగధీర తర్వాత బన్నీ-రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చేయాలని అల్లు బాస్ విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకనో వీలుపడలేదు. మగధీర టైమ్ లోనే రాజమౌళితో అరవింద్ కి విభేధాలు తలెత్తాయని దానివల్లనే కలిసి పని చేయలేకపోయారని గుసగుసలు వినిపించాయి. ఇక ఈ రంగంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ సర్వసాధారణం గనుక ఇప్పటికి అన్నీ సద్ధుమణిగాయి. ఇరువురి నడుమా సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇక గీతా ఆర్ట్స్ లో రాజమౌళి పని చేయడం లాంచనమేనని టాక్ వినిపిస్తోంది.
పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగింది. హిందీ లోనూ అతడు స్థిరమైన మార్కెట్ ని అందుకున్నాడు. అందువల్ల అతడితో పని చేసేందుకు రాజమౌళి కూడా సుముఖంగానే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా తీయాలని అరవింద్ బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు. 2023-24లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
అయితే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా పూర్తయ్యాకే ఏదైనా. ఈ సినిమా కోసం నిర్మాత కెఎల్ నారాయణతో కలిసి పనిచేయడానికి రాజమౌళికి కమిట్ మెంట్ ఉంది. అప్పటి వరకు అతను గీతతో కలిసి పనిచేయలేకపోవచ్చు. మహేష్ బాబు సినిమాను ముగించిన తర్వాత అల్లు అర్జున్ తో పాన్ ఇండియా సినిమా చేసే వీలుంటుంది. ఇప్పటికే రాజమౌళి కూడా అరవింద్ కు ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి అధికారికంగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి దృష్టి కేవలం మహేష్ చిత్రంపైనే ఉంది. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును తయారు చేయడంలో బిజీగా ఉన్నారు.