టైటిల్ కార్డులో మెగా అభిమానం.. వింటేజ్ మెగాస్టార్ గుర్తొచ్చేలా..!

Update: 2023-01-06 03:51 GMT
ఒక అభిమాని స్టార్ హీరో ని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్య అలా ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు బాబీ. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయిన బాబీ వాల్తేరు వీరయ్య సినిమాతో ఆయన్ను డైరెక్ట్ చేశారు. మెగా ఫ్యాన్స్ అంతా చిరుని ఎలా చూడాలని అనుకుంటున్నారో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీని తెరకెక్కించాడని తెలుస్తుంది. సినిమాలో చిరు ఊర మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేస్తుందని అంటున్నారు. ప్రతి విషయంలో బాబీ చాలా కేర్ తీసుకున్నాడట.

అంతేకాదు సినిమా టైటిల్ కార్డులో కూడా మెగా అభిమానం చూపించాడట. చిరు సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి అని పడటం కామనే కానీ ఒకప్పుడు వింటేజ్ చిరంజీవి సినిమా స్టైల్ లో ఆ టైటిల్ కార్డుని వాల్తేరు వీరయ్యకి వాడుతున్నారట. ఆ స్టైల్ ని కొద్దిగా మార్చి టైటిల్ కార్డ్ లో వేస్తున్నారని తెలుస్తుంది. ఓ విధంగా మెగా ఫ్యాన్స్ కి ఇది కూడా సూపర్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. వాల్తేరు వీరయ్య సినిమా పక్కా మెగా ట్రీట్ అందిస్తుంది అని చెప్పేందుకు ఇది కూడా ఒక ఉదహరణ అని చెప్పొచ్చు. సినిమాలో ఇది ఉంది అది లేదు అనకుండా అన్ని అంశాలతో ఫిల్ చేశారట.

కథ అనుకున్న దగ్గర నుంచి చిరుని మెగా ఫ్యాన్స్ ఎలా చూడాలని ఆశిస్తున్నారో అలాంటి మాస్ యాటిట్యూడ్ ని ఫాలో అయ్యాడట. అందుకే వాల్తేరు వీరయ్య సినిమా వింటేజ్ చిరుని గుర్తుకు తెస్తుందని అంటున్నారు. సినిమాలో చిరు లుక్, మాసిజం అంతా కూడా అదిరిపోతుందట. శృతి హాసన్ చమక్కులు.. దేవి మార్క్ మ్యూజిక్ కూడా వాల్తేరు వీరయ్య సినిమాకు చాలా ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇక మైత్రి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయినట్టు తెలుస్తుంది.

సినిమాలో మరో మెయిన్ హైలెట్ మాస్ మహారాజ్ రవితేజ నటించడం. అదేదో గెస్ట్ రోల్ అనుకున్న రవితేజ పాత్ర దాదాపు సినిమాలో చిరుకి ఈక్వల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా ఈ మెగా మాస్ ట్రీట్ మెగా ఫ్యాన్స్ అందరికి ఐ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. వీరయ్య బజ్ అయితే ఓ రేంజ్ లో ఉండగా సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది జనవరి 13న తెలుస్తుంది. పోటీగా ఎన్ని సినిమాలు వచ్చినా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ని షేక్ చేయడం పక్కా అని అంటున్నారు చిత్రయూనిట్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News