మెగా హీరోలు @2019

Update: 2019-12-28 10:26 GMT
ఈ ఏడాది కొందరు హీరోలకి మంచి విజయాలు దక్కితే మరికొందరికి నిరాశే మిగిలింది. అయితే మెగా హీరోలకు మాత్రం బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో 'వినయ విధేయ రామ' సినిమాతో థియేటర్ లోకి వచ్చాడు రామ్ చరణ్. బోయపాటి -చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టింది. కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ బాగానే వచ్చినా ఫైనల్ గా బయ్యర్లు ఘోరంగా నష్ట పోయారు.

ఈ సంక్రాంతి చరణ్ ను డిస్సపాయింట్ చేస్తే అదే ఫ్యామిలి కి చెందిన వరుణ్ కి మాత్రం బాగా కలిసొచ్చింది. జనవరిలో థియేటర్స్ లోకి వచ్చిన 'F2' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక వరుణ్ తర్వాత ఏప్రిల్ లో థియేటర్స్ లోకి వచ్చిన సాయి ధరం తేజ్ కి 'చిత్రలహరి' ఓ కొత్త ఉత్సాహాన్ని అందించి హిట్ ట్రాక్ లోకి నెట్టింది. తేజ్ తర్వాత వరుణ్ తేజ్ మళ్ళీ సెప్టెంబర్ లో 'గద్దల కొండ గణేష్' గా వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

మెగా యంగ్ హీరోలతో పాటు మెగా స్టార్ కూడా 'సైరా నరసింహ రెడ్డి'తో ఈ ఏడాది గట్టి గా సందడి చేసాడు. భారీ అంచనాల తో వచ్చిన ఈ సినిమా కష్టంగానే బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ ఆ తర్వాత ప్రాఫిట్స్ జోన్ లోకి వెళ్ళింది. ఇక చరణ్ ఆరంభం లో డిజాస్టర్ అందుకుంటే తేజ్ మాత్రం ఎండింగ్ లో 'ప్రతి రోజు పండగే' తో సూపర్ హిట్ కొట్టి ఈ ఏడాది మెగా హీరోలదే పై చెయి అని రుజువు చేసాడు. చరణ్ మినహా మిగతా మెగా హీరోలందరూ విజయాలతో ఈ ఏడాది తమ సత్తా చాటారు.


Tags:    

Similar News