ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. రీమేక్ సినిమా అయినా కానీ మోహన్ రాజా అద్భుతంగా తెరకెక్కించిన వైనం ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పటికీ చిత్రబృందం ప్రచార కార్యక్రమాలతో హైప్ పెంచుతూనే ఉంది.
తాజాగా గాడ్ ఫాదర్ సంగీత బృందం చెప్పిన సంగతులు ఆశ్చర్యపరిచాయి. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవికి సాహిత్యాభిరుచితో పాటు వ్యాకరణంపై ఉన్న పట్టు గురించి లిరిసిస్టులు మాట్లాడారు. దర్శకుడు మోహన్ రాజా స్వరకర్త థమన్... గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి అనంత్ శ్రీరామ్ ఇంటర్వ్యూ లో మాట్లాడారు. ఈ చాటింగ్ సెషన్ లో ప్రముఖ యువ గీత రచయిత అనంత్ శ్రీరామ్ తెలుగు సాహిత్యంలో చిరంజీవికి ఎంత ఇష్టమో భాష వ్యాకరణం యాసలో అందం ఎంతవరకు అర్థం చేసుకున్నాడో వెల్లడించారు. "నజబజా జజరా" ఈ చిత్రంలోని నేపథ్య పాటల్లో ఒకటి. వాస్తవానికి థియేటర్ లలో అభిమానులకు రోమాలు లేచి నిలుచునేంత గొప్ప క్షణాలను అందించింది. ఈ పాట గురించి అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ... పాట మొదటి వెర్షన్ విన్న తర్వాత చిరంజీవి ఏదో చెప్పడానికి తనను పిలిచారని అది తన మనసును కదిలించిందని అన్నారు.
"నజబజ జాజరా గజగజ ఒణికించే గజరావు అదిగో రా నేను రాసిన గీతం.. అది విన్న తర్వాత మెగాస్టార్ ఫోన్ చేసి 'చంపకమాల' ఫార్ములా తీసుకుని దానితో 'మత్తేభం'ని వివరించడం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. అతను కేవలం తెలుగు వ్యాకరణం చంపకమాల గురించి మాట్లాడినట్లయితే బహుశా అతనికి తన 10వ తరగతి తెలుగు సబ్జెక్ట్ బాగా గుర్తుండేదని నేను అనుకున్నాను. కానీ మత్తేభం అంటే పవిత్రమైన ఏనుగు గురించి మాట్లాడిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది" అని అనంత్ శ్రీరామ్ అన్నారు.
అదే ఇంటర్వ్యూలో రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ "చిరు చాలా పుస్తకాలు చదివారు. తనను తాను అప్ డేట్ గా ఉంచుకోవడం వల్ల తెలుగుపై అతని పట్టు నిజంగా అద్భుతమైనది" అని అన్నారు. దర్శకులు చెప్పేది శ్రద్ధగా చేయడమే కాదు తన సినిమాకి అవసరమైన కీలకమైన విభాగాల్లో చిరుకు చాలా గ్రిప్ ఉంది. కథ ఎంపిక నుంచి సంభాషణా చాతుర్యం వరకూ.. అలాగే లిరిక్స్.. సాహిత్యం.. మ్యూజిక్ పైనా ఆయన పరిజ్ఞానం అపారమైనది. అందుకే చిరు సినిమాల్లో ఆ ప్రత్యేకత ఎప్పుడూ బయటపడుతూనే ఉంటుంది.
నటులపై ప్రముఖుల ప్రశంసలు..
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై క్రిటిక్స్ సహా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. చిరు డీసెంట్ పెర్ఫామెన్స్ కి.. మోహన్ రాజా దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ పొలిటికల్ డ్రామాలో నయనతార- సత్య దేవ్- సల్మాన్ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. గాడ్ ఫాదర్ మలయాళ చిత్రం లూసిఫర్ కి అధికారిక రీమేక్. థియేట్రికల్ ట్రైలర్ నుంచి ఈ మూవీపై హైప్ పెరగింది. సత్యదేవ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించడం మరో కొసమెరుపు. సత్యదేవ్ కెరీర్ కి అవసరమైన బూస్ట్ ఇచ్చారు చిరు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.