మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. రేపు (ఆగస్టు 22) చిరు పుట్టినరోజు సందర్భంగా తాజాగా #Chiru153 నుంచి మేకర్స్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ అందించారు. ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయడం ద్వారా సుప్రీమ్ లుక్ ని రివీల్ చేశారు.
ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నట్లుగానే చిరంజీవి 153వ చిత్రానికి ''గాడ్ ఫాదర్'' అనే టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ లో చిరంజీవి పూర్తి లుక్ ని రివీల్ చేయనప్పటికి.. ఈ బ్యాక్ సైడ్ పోజ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. మెగాస్టార్ ఇందులో తలకు క్యాప్ పెట్టుకొని చేతిలో గన్ పట్టుకొని నిలబడి ఉన్నాడు.
'గాడ్ ఫాదర్' టైటిల్ మాదిరిగానే.. లోగో కూడా చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. 'GOD FATHER' లోని 'A' లెటర్ లో చిరంజీవి గన్ పట్టుకుని ఉన్న బ్యాక్ సైడ్ పోజ్ ని ఉంచారు. ఇది మెగాస్టార్ కు యాప్ట్ టైటిల్ అని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చిరంజీవి కెరీర్ లో మరో వైవిధ్యమైన సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నారు.
కాగా, 'గాడ్ ఫాదర్' సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' చిత్రానికి తెలుగు రీమేక్. ఒరిజినల్ స్టోరీలోని ప్రాథమిక ప్లాట్ లైన్ ను మాత్రమే తీసుకొని మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు తగినట్లుగా దర్శకుడు మోహన్ రాజా స్క్రిప్టు లో మార్పులు చేశారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ''గాడ్ ఫాదర్'' సినిమా రూపొందుతోంది. ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో స్టంట్ మాస్టర్ సిల్వ ఆధ్వర్యంలో ఈ సినిమాలోని హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది.