యూట్యూబ్ వ్యూస్.. ఇటీవల ఫ్యాన్ ఫాలోయింగ్ కి సింబాలిక్ గా మారింది. ఏదైనా టీజర్ - ఆడియో లేదా సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన విజువల్స్ కి యూట్యూబ్ లో దక్కే ఆదరణను కొలమానంగా చూస్తున్నారు. రీసెంటుగా కొత్త సినిమాల టీజర్లు - ట్రైలర్లు కోట్లాది వ్యూస్ తో దూసుకెళుతూ స్టార్లకు ఉన్న బలాన్ని తెలియజేస్తున్నాయి. మొన్నటికి మొన్న రజనీ- శంకర్ ల `2.ఓ` టీజర్ యూట్యూబ్ లో రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది. అంతకుముందు మెగాస్టార్ `సైరా` ఫస్ట్ లుక్ టీజర్ కి గొప్ప ఆదరణ దక్కింది. ఇప్పటికీ ఇవి యూట్యూబ్ - సామాజిక మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాయి.
సరిగ్గా ఇలాంటి టైమ్ లో తమిళ స్టార్ హీరో - ఇలయదళపతి విజయ్ యూట్యూబ్ లో సాధించిన ఓ అరుదైన రికార్డు గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. విజయ్ నటించిన `మెర్సల్` ఇదివరకూ రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకి రెహమాన్ అందించిన బాణీలు బ్లాక్ బస్టర్. ఆ ఆల్బమ్ ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డులు బద్ధలు కొడుతోంది. అంతర్జాలంలో 35 కోట్ల (350 మిలియన్) వ్యూస్ తో మెర్సల్ పాటలు రికార్డ్ సృష్టించాయి. కేవలం నాలుగే నాలుగు పాటలు ఉన్న ఆల్బమ్(రెహమాన్ సంగీతం) ఇంతటి ఆదరణకు నోచుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇది ఇలయదళపతి విజయ్ ఫ్యాన్స్ పవర్ అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఈ రికార్డ్ గురించి సోని సంబరంగా చెప్పుకొచ్చింది. ``ప్రౌడ్ .. ప్రౌడర్.. ప్రౌడెస్ట్!`` అంటూ సోని మ్యూజిక్ సంస్థ సంబరాలు చేసుకుంటోంది. 350 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న తొలి తమిళ ఆల్బమ్ `మెర్సల్` అంటూ ఆ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించి `ఆలపోరాన్ తమిజన్` పేరుతో ఓ వెర్టికల్ వీడియోని సోని లాంచ్ చేసింది. ఈ వీడియో విజయ్ ఫ్యాన్స్ లో దూసుకెళుతోంది. విజయ్ అంటే ఫ్యాన్స్ కి ఎంత పిచ్చి అభిమానమో - అతడిని కోలీవుడ్ పవర్ స్టార్ అని ఎందుకు పిలిచారో ఇప్పుడైనా క్యాచ్ చేశారా..?