రెండో ప్లేస్ తో సరిపెట్టుకున్న బాహుబలి2

Update: 2018-01-09 06:30 GMT
2017లో ఫిలిం ఇండస్ట్రీలో బెస్ట్ అనదగ్గవన్నీ దాదాపుగా బాహుబలి2 కంక్లూజన్ కే దక్కాయి. భాషతో సంబంధం లేకుండా.. జనాలంతా బాహుబలి2కే మొగ్గుచూపారు. అనేక రకాల దేశీయ.. విదేశీ పోల్స్-ఓటింగ్స్ లో బాహుబలి సీక్వెల్ నే ఎంచుకున్నారు ఆఢియన్స్.

అయితే.. ఇప్పుడు ఓ చిన్నపాటి సెన్సేషన్ నమోదైంది. 2017లో వచ్చిన మోస్ట్ పాపులర్ మాస్ మూవీ ఏది అంటూ.. ట్విట్టర్ లో ఓ ప్రముఖ వ్యక్తి పోల్ నిర్వహించగా.. ఇందులో పోటీ పడ్డ సినిమాల్లో బాహుబలి2.. విజయ్ మెర్సల్.. అజిత్ వివేగం.. శివ కార్తికేయన్ వేలైక్కారన్ లు పోటీలో ఉన్నాయి. ఇక్కడ బాహుబలి2 మినహాయిస్తే.. మిగిలిన అన్నీ తమిళ మూవీస్ అనే విషయం గుర్తుంచుకోవాలి. దీంతో ఈ పోల్ తమిళ్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినదే అని అర్ధమవుతుంది. మూవీని చూడడంలో బాహుబలి2ని కూడా విపరీతంగానే చూసిన తమిళ జనాలు.. పోల్ దగ్గరకు వచ్చేసరికి స్థానికతకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది.

మొత్తం 40వేల మందికి పైగా పాల్గొన్న ఈ పోల్ లో బాహుబలి2కి 23శాతం ఓట్లు పడితే.. మెర్సల్ కు అంతకు రెట్టింపునకు పైగా ఎక్కువగా 58 శాతం ఓట్లు పోలయ్యాయి. 16 శాతం ఓట్లతో వివేగం.. 3 శాతం ఓట్లతో వేలైక్కారన్ నిలిచాయి. తమ సొంత ప్రాంతానికే ప్రాధాన్యత.. తమిళ్ కే ఇంపార్టెన్స్ అనే విషయాల్లో తమిళ జనాలు మరోసారి తమ సిన్సియారిటే ఏంటో చూపించేశారు.
Tags:    

Similar News