మైక్ టైస‌న్ నే దించేస్తున్నారా?

Update: 2019-12-21 07:18 GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్` తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ కు జోడీగా అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ న‌టించ‌నుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌వుతున్నాయి. ఫైట‌ర్ కోసం కొన్ని నెల‌లుగా పూరి క‌స‌ర‌త్తు గురించి తెలిసిందే. బాక్సింగ్ నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించే క‌థాంశాన్ని పూరి రెడీ చేశార‌ట‌. ఇందులో విజ‌య్ బాక్స‌ర్ గా న‌టిస్తాడు. కిక్ బాక్సింగ్ అంటే పూరి ఆ రోల్ ని ఎంత బ‌లంగా రాసుకున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు.

రౌడీ కెరీర్ బెస్ట్ గా ఈ సినిమాని తీర్చి దిద్దే ఛాన్సుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ బాక్స‌ర్ ని ఢీకొట్టే విల‌న్ ఎవ‌రు? అంటే... అందుకోసం ఇప్ప‌టికే ఆర్.ఎక్స్ 100 హీరో కార్తికేయ‌ను ఎంపిక చేశార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో వేరొక స్పెష‌ల్ స్టార్ క‌నిపించ‌నున్నార‌ట‌. పూరి మైండ్ లో అంత‌ర్జాతీయ‌ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ పేరు కూడా మెదిలింద‌ని ఓ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. మైక్ టైస‌న్ ని ఈ సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు అంటూ ప్ర‌చారం సాగుతోంది. మ‌రి పూరి ప్ర‌పోజ‌ల్ కి మైక్ టైస‌న్ ఒప్పుకుంటే సినిమా రేంజ్ మారిపోవ‌డం ఖాయం. ఈ చిత్రాన్ని తెలుగు-త‌మిళం- హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. ఇప్ప‌టికే హిందీ డిస్ట్రిబ్యూట‌ర్ కం టాప్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ తో పూరి-చార్మి బృందం చేతులు క‌లిపారు కాబ‌ట్టి బాలీవుడ్ లో ఈ చిత్రం పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంది.

అర్జున్ రెడ్డి  చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్ తో విజ‌య్ కు ఉత్త‌రాదినా మంచి క్రేజ్ ద‌క్కింది. విజ‌య్ పెర్ఫామెన్స్ కి బాలీవుడ్ భామ‌లు సైతం ఫ్యాన్స్ అయ్యారు. ఇక జాన్వీ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అతిలోక సుంద‌రి త‌న‌య‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మామ్ ఛ‌ర్మిష్మాను ను అందుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రి ఈ కాంబినేష‌న్‌ కి అంత‌ర్జాతీయ బాక్స‌ర్ మైక్ టైస‌న్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహ‌కైనా అంద‌దు. అదీ పూరి సినిమా అంటే? క‌మ‌ర్షియ‌ల్ గా ఏ రేంజులో ఉంటుందో చెప్పాల్సిన ప‌నే లేదు. ఎమోష‌న్ ని పీక్స్ లో ఎలివేట్ చేయ‌డం ఖాయం అనే భావిస్తున్నారు.
Tags:    

Similar News