చిలికి చిలికి గాలి వాన మారిన తీరుగా రామ్ గోపాల్ వర్మ జిఎస్టి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఎక్కడ వెళ్లి ఆగుతుందో అర్థం కాక అభిమానులు అయోమయంలో ఉన్నారు.మీడియా కథనాల ప్రకారం ఇది జిఎస్టి వీడియోకు వర్క్ చేసిన టెక్నికల్ టీం మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. అందులో దీనికి నేపధ్య సంగీతం సమకూర్చిన కీరవాణి పేరు కూడా ఉన్నట్టు వస్తున్న పుకార్లు మ్యూజిక్ లవర్స్ ని కలవరపెడుతోంది. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి తన పాతికేళ్ళ అనుభవంలో ఏనాడూ వివాదాల జోలికి వెళ్ళని కీరవాణికి కనక నోటీసులు ఇస్తే ఇది ఆయనకు ఇబ్బంది కలిగించే విషయమే. కాని దీని గురించి పక్కా సమాచారం అయితే ఇంకా అందుబాటులోకి రాలేదు. కీరవాణితో పాటు మరికొందరికి పోలీస్ శాఖ నోటీసులు ఇవ్వబోతోంది అని కొన్ని న్యూస్ ఛానల్స్ లో ప్రసారం చేసినట్టుగా వచ్చిన గాసిప్స్ చర్చకు దారి తీస్తున్నాయి.
నిజానికి కీరవాణి చాలా కాలం నుంచి వర్మతో లాంగ్ టర్మ్ రిలేషన్లో లేడు. ఇద్దరు కలిసి ఒకే ఒక్క పూర్తి సినిమాకు పని చేసారు. అది క్షణ క్షణం. దాని తర్వాత నాగార్జున 'అంతం'కు పాక్షికంగా పనిచేసారు కీరవాణి. దాని తర్వాత వర్మ చాలా సినిమాలు తీసాడు కాని ఏనాడూ కీరవాణితో సంగీతం చేయించలేదు. కారణాలు తెలియదు కాని ఇద్దరు కలిసి వర్క్ చేయలేదు అన్నది నిజం. ఇన్నేళ్ళ తర్వాత వర్మ తన జిఎస్టి కోసం కీరవాణిని సంప్రదించడం - ఈయన వెంటనే ఒప్పేసుకుని చేసేయటం చకచక జరిగిపోయాయి. జిఎస్టి వీడియోలో కాస్త ఫీల్ కలిగిందంటే అది క్రీమ్ పేరుతో కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ప్రధాన కారణం.
మీడియా కథనాల ప్రకారం కీరవాణికి నోటీసు ఇవ్వాలి అనుకోవడం గురించి కేవలం ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. జరిగే అవకాశం కూడా లేకపోవచ్చు. కంటెంట్ రాయడంలో కాని తీయడంలో కాని సంగీత దర్శకుడికి ఎటువంటి బాధ్యత ఉండదు. అలాంటప్పుడు ఎలా నోటీసులు ఇస్తారనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం.అందుకే ఆందోళన అనవసరం అని చెప్పొచ్చు.