ప్రభాస్ ఇప్పుడు సాహో షూటింగ్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. బాహుబలి కోసం ఏ హీరో చేయనంత సాహసం చేసిన యంగ్ రెబల్ స్టార్.. తను వెచ్చించిన సమయానికి తగినంతగానే క్రేజ్ తెచ్చుకున్నాడు. తన తర్వాతి మూవీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మరీ డెసిషన్ తీసుకుని చేస్తున్న మూవీ సాహో.
ఇప్పుడు సాహో చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రభాస్ కొత్త సినిమా అప్ డేట్స్ కోసం బాలీవుడ్ మీడియా కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే.. శ్రద్ధా కపూర్ హీరోయిన్ వంటి కొన్ని విషయాలు మినహాయిస్తే.. అసలిప్పటి వరకూ సినిమా సంగతులేవీ బయటకు రాలేదు. ఎలాంటి లీక్ బయటకు రాలేదు. ఏ చిన్న సంగతి లీక్ అయినా.. సినిమాపై క్యూరియాసిటీ తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతోనే ఇంతగా జాగ్రత్త పడ్డారు. ఇప్పటివరకూ హైద్రాబాద్ లో వేసిన సెట్స్ లో షూటింగ్ చేయడంతో పెద్దగా సమస్యేమీ రాలేదు. చిన్న విషయం కూడా లీక్ కాకుండా తీసుకున్న చర్యలు మంచి ఫలితమే ఇచ్చాయి.
ఇప్పుడు ప్రభాస్ అండ్ టీం అంతా మిడిల్ ఈస్ట్ కు ప్రయాణం కడుతున్నారు. అబుదాబిలో షూటింగ్ చేయబోతున్నారు. కొన్నికీలకమైన సన్నివేశాలను పిక్చరైజ్ చేయబోతున్నారు. ఇక్కడ కూడా షూటింగ్ లో మొబైల్ బ్యాన్ అనేశారట. ఇందుకు ప్రభాస్ సహా అందరూ మద్దతు పలికారని తెలుస్తోంది. సాహో గురించి ఏ మాత్రం లీక్ కాకుండా తీసుకుంటున్న చర్యలు.. ఇప్పటివరకూ సక్సెస్ అయ్యాయనే చెప్పాలి.