నామీద ఇద్దరు హీరోలు ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఇందు కోసం యాభై నుంచి వంద మందిని నియమించుకుని నన్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా మోహన్‌బాబు మరో హీరోకు మధ్య మాటల యుద్ధం జరుగుతోందంటూ నెట్టింట ఓ వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారాన్ని నిజం చేసేవిలా వున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే... కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొంత విరామం తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం `సన్ ఆఫ్ ఇండియా`. రచయిత, దర్శకుడు డైమండ్ రత్నబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో హీరో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల హీరో మంచు విష్ణు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసిన అనంతరం మీడియాలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రి పేర్నినాని ప్రత్యేకంగా మోహన్‌బాబు ఇంటికి వెళ్లడం.. ఆ తరువాత దాని గురించి మోహన్‌బాబు మాట్లాడటం వంటి విషయాలపై నెట్టింట ట్రోల్స వైరల్ గా మారిన విషయం తెలిసిందే. వీటిపై మోహన్ బాబు ఘాటుగా స్పందించారు. నామీద ఇద్దరు హీరోలు ట్రోలింగ్ చేయిస్తున్నారు. యాభై నుంచి వంద మంది టీమ్ ని పెట్టుకుని అదే పనిగా నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు. వాళ్లెవరో నాకు తెలుసు.
వారిని ప్రకృతి గమనిస్తోంది. వారికి ఇప్పుడు బాగానే వుంటుంది కానీ ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు. అప్పుడు వారి వెనక ఎవరూ వుండరు.. ఎవరూ సహాయం చేయరు` అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఇంతకీ మోహన్ బాబు ని టార్గెట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు ఎవరు? .. ఎందుకు వారి పేర్లు చెప్పడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇంతకీ ఇద్దరు హీరోలు ఎందుకు మోహన్ బాబుని టార్గెట్ చేస్తున్నారు? .. అంత అవసరం ఏంటీ? .. యాబై నుంచి వంద మంది ని నియమించుకుని మోహన్ బాబుని ట్రోల్ చేయించాలని ఎందుకు అనుకుంటున్నారు? .. ఇందులో వున్న నిజమెంత? .. అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.