ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల నడుమ దేశ వ్యాప్తంగా విడుదల అయిన సమయంలోనే ఒక చిన్న సినిమా గా పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన సినిమా ది కశ్మీర్ పైల్స్. విడుదల అయిన మొదటి రోజు పాజిటివ్ టాక్ దక్కించుకుని ఒక మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. సినిమాకు వచ్చిన పబ్లిసిటీ మరియు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ నుండి అందిన సహకారంతో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పంట పండింది.
మొదటి రోజు తర్వాత కంటిన్యూస్ గా వారం పది రోజుల పాటు వసూళ్లు పెరుగుతూనే వచ్చాయి. ఊహించిన దాని కంటే పది రెట్ల వసూళ్లు అధికంగా వచ్చాయి. పెట్టిన పెట్టుబడికి పదుల రెట్ల లాభాలు దక్కాయి. దాంతో పాటు ఎన్నో అరుదైన రికార్డులు నమోదు అయ్యాయి.. మంచి గుర్తింపు దక్కింది. సినిమాకు కొన్ని విమర్శలు వచ్చినా కూడా మొత్తానికి ది కశ్మీర్ ఫైల్స్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
థియేటర్లలో ప్రాంతీయ భాషలో సినిమాను చూడలేక పోయిన వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారు. సాదారణంగా అయితే నాలుగు వారాల్లోనే ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కాని అనూహ్యంగా సినిమా థియేటర్ రన్ బాగున్న కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ ను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు ఈ సినిమా ను జీ5 ఓటీటీ లో మే 13వ తారీకున స్ట్రీమింగ్ చేసేందుకు గాను సిద్దం అయ్యారు. ప్రముఖ ఓటీటీ అయిన జీ 5 వారు ఈ సినిమాను హిందీ తో పాటు మొత్తం అన్ని సౌత్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జీ 5 వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల నుండి మరియు బాలీవుడ్ మీడియా నుండి సమాచారం అందుతోంది.
జీ5 ఇప్పటికే ఉత్తరాదిన అత్యధిక ఖాతాదారులను కలిగి ఉంది. సౌత్ లో కూడా ఈ సినిమాను చూసేందుకు జీ5 ఖాతా దారులుగా పెద్ద సంఖ్యలో జనాలు చేరే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఓటీటీ లో కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు. అసలు కశ్మీర్ ఫైల్స్ లో ఏముంది అని చాలా మంది చూడాలని కోరుకుంటున్నారు.