తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ తెలుగు అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ 'ఆధిత్య వర్మ' తో ప్రేక్షకుల కు పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. ఏ ముహూర్తాన ప్రారంభం అయ్యిందో కాని సినిమా మొదటి నుండి కూడా ఏవో అడ్డంకుల ను ఎదుర్కొంటూనే ఉంది. పూర్తి అయ్యి ఆరు నెలలు అయినా కూడా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈనెల 8న విడుదల చేస్తామంటూ సెన్సార్ కూడా చేయించారు. కాని చివరి నిమిషం లో సినిమా విడుదల ఆగి పోయింది.
సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ వచ్చిన తర్వాత సినిమా ఎందుకు ఆగి పోయిందో ఎవరికి తెలియదు. అసలు సినిమా విడుదల ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేశారు. ఈ సమయం లోనే మరోసారి ఆధిత్య వర్మ కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. వచ్చే వారం లో అంటే ఈనెల 22వ తారీకున చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. సినిమాకు అడ్డుగా ఉన్న అవరోధాలు అన్ని కూడా తొలగి పోయాయని ఇక సినిమాను ప్రేక్షకుల ముందు కు తీసుకు రావడమే అంటూ యూనిట్ సభ్యులు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
తెలుగు లో అర్జున్ రెడ్డి సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది. హిందీ లో రీమేక్ అయిన కబీర్ సింగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. కాని ప్రేక్షకులు మాత్రం ఇన్ని సార్లు సినిమా వాయిదా పడటంతో సినిమా ఫలితం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ అతి జాగ్రత్త కారణం గా ఈ సినిమా విడుదలైందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు నిర్మాతల కారణంగా ఆలస్యం అయ్యిందని కొందరు అంటున్నారు. ఎంత లేట్ అయినా సినిమా విడుదల తర్వాత సక్సెస్ అయితే ఇన్ని రోజుల ఎదురు చూపులను మర్చి పోవడం ఖాయం.