2023 సీతారామం బ్యూటీకి అంకితం

Update: 2022-12-31 02:30 GMT
ఒకే ఒక్క సినిమాతో గోల్డెన్ లెగ్ అన్న ప్ర‌శంస అందుకుంది మృణాల్ ఠాకూర్. ఈ భామ న‌ట‌నాభిన‌యం తెలుగు ఆడియెన్ కి పిచ్చిగా న‌చ్చేసింది. `సీతా రామం`లో దుల్కార స‌ర‌స‌న అద్భుత‌ నటనకు విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలతో పాటు ప్రేక్ష‌కుల ప్రేమ ద‌క్కింది. అయితే ఈ మూవీ ఘ‌న‌విజ‌యం త‌ర్వాతా చాలా ఆఫర్లు వచ్చినా కానీ మృణాల్ ఏ తెలుగు చిత్రానికి సంతకం చేయలేదు.

ఈ కొత్త‌మ్మాయ్ స్క్రిప్టుల ఎంపిక విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. అంతేకాదు.. త‌న పాత్ర‌కు ప్రాధాన్యత ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతోంద‌ని స‌మాచారం. క‌థ కంటెంట్ హీరో బ్యాన‌ర్ వ్యాల్యూ ఇలా చాలా విష‌యాల‌ను ప‌రిశీలిస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు నేచురల్ స్టార్ నాని స‌ర‌స‌న న‌టింజ‌జేసేందుకు మృణాల్ తో మైత్రి అధినేత‌లు మంత‌నాలు సాగిస్తున్నార‌ని తెలిసింది.


నూత‌న సంవ‌త్స‌రంలో అడుగుపెడుతున్న‌ సందర్భంగా నేచుర‌ల్ స్టార్ త‌న కొత్త సినిమాని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడ‌ని.. ఈ మూవీతో నూతన దర్శకుడు ప‌రిచ‌యం కానున్నార‌ని తెలిసింది. ఇది రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్. అందుకే నానీకి జోడీగా మృణాల్ స‌రిపోతుంద‌ని భావించి ఎంపిక చేసుకున్నార‌ట‌. వచ్చే ఏడాది ఆరంభ‌మే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుండగా జనవరి 1న సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ‌ లండన్ లో జరగనుంది. నాని కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ తో రూపొంద‌నుంది. ప్ర‌స్తుతానికి మృణాల్ ఇంకా ప్రాజెక్టుకి సంత‌కం చేయ‌లేదు. ప‌లు దఫాల చ‌ర్చ‌ల అనంత‌రం త‌న నుంచి పాజిటివ్ సంకేతం క‌నిపించింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ లో భాగస్వామిగా ఉన్న చెరుకూరి మోహన్ తన సొంత బ్యానర్ `వైరా ఎంటర్ టైన్ మెంట్స్`ని రారంభించి ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. నాని సినిమాతో పాటు ప‌లువురు యువ‌హీరోల సినిమాల్లో న‌టింప‌జేసేందుకు మృణాల్ పేరు ప‌రిశీల‌నలో ఉంది. నూత‌న సంవ‌త్స‌రంలో వాటి వివ‌రాలు వెల్లడి కానున్నాయ‌ని తెలిసింది. అలాగే ప‌లువురు సౌత్ అగ్ర హీరోల చూపు కూడా మృణాల్ పై ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 2023 మృణాల్ కి అంకిత‌మైనా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని అత్యంత స‌న్నిహిత సోర్స్ లీకుల‌ను అందిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News