అమ‌రావ‌తిలోనే టాలీవుడ్!- ముర‌ళీమోహ‌న్

Update: 2018-11-08 10:23 GMT
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చిన పాయింట్ ఏపీ ఫిలిం ఇండ‌స్ట్రీ. దీని గురించి గ‌త నాలుగేళ్లుగా అలుప‌న్న‌దే లేకుండా ఎడ‌తెగ‌ని చందంగా చ‌ర్చ సాగిస్తూనే ఉన్నారు సినీ పెద్ద‌లు. వైజాగ్‌ లో కొత్త ఫిలిం ఇండ‌స్ట్రీని అభివృద్ధి చేస్తామ‌ని ఓసారి - లేదు క్యాపిట‌ల్ సిటీ అమ‌రావ‌తిలోనే మ‌రో కొత్త సినీ ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేస్తామ‌ని ఇంకోసారి - అబ్బే నెల్లూరు త‌డ అయితే ఇంకా బావుంటుంద‌ని వేరొక‌రు రక‌ర‌కాలుగా జ‌నాల్ని క‌న్ ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. ఏపీ టాలీవుడ్ విష‌యంలో పైకి ఒక మాట‌ - లోన ఇంకోటి జ‌రుగుతోంద‌న్న‌ది మాత్రం స్ప‌ష్టంగా అంద‌రికీ అర్థ‌మైంది. ప్ర‌తిసారీ కొత్త ఫిలిం ఇండ‌స్ట్రీ ఏర్పాటు గురించి ర‌క‌ర‌కాలుగా ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తూనే - దీనిపై నిగూఢంగా ఇంకేదో కొత్త క‌థను న‌డిపిస్తున్నార‌న్న చ‌ర్చ‌ ఫిలిం వ‌ర్గాల్లోనూ సాగుతోంది.

స‌రిగ్గా అలాంటి టైమ్‌ లోనే విజ‌య‌వాడలోని ఏపీఎఫ్‌ డీసీ (ఫిలిండెవ‌ల‌ప్‌ మెంట్ కార్పొరేష‌న్) ఓ అస్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. విశాఖ న‌గ‌రంలో ప్ర‌ఖ్యాత ఏవీఎం స్టూడియోస్‌ - నంద‌మూరి బాల‌కృష్ణ విడివిడిగా ఫిలింస్టూడియోలు నిర్మించేందుకు ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని - దీనికి సంబంధించి ఎఫ్‌ డీసీ అధికారికంగా మీడియాకి ప్ర‌క‌టించింది. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇంకా ఏదో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంద‌ని తాజాగా ఎంపీ ముర‌ళిమోహ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న స్ప‌ష్టం చేస్తోంది.

తాజాగా ఓ విస్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఇది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో టాలీవుడ్ ఏర్పాటు గురించి నాకైతే పూర్తిగా తెలియ‌దు కానీ ఒక కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటు గురించి స‌న్నాహాలు మాత్రం జ‌రుగుతున్నాయ‌ని ముర‌ళిమోహ‌న్ హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్‌ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో తెలిపారు. ``మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్‌ కి ప‌రిశ్ర‌మ వ‌చ్చిన‌ప్ప‌టి ప‌రిస్థితి వేరు. కానీ ఇప్ప‌టి ప‌రిస్థితి వేరు. రెండు రాష్ట్రాలు అయినా మ‌న‌మంతా తెలుగువాళ్ల‌మే. అందువ‌ల్ల భాష స‌మ‌స్య లేదు. హైద‌రాబాద్‌ లో ప‌రిశ్ర‌మ ఉండ‌గానే - మ‌రో కొత్త ప‌రిశ్ర‌మ అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌న్నాహ‌కాల్లో ఉంది. అయితే హైద‌రాబాద్ నుంచి ఒకేసారి ప‌రిశ్ర‌మ వెళ్ల‌డం అన్న‌ది కొంచెం క‌ష్టంతో కూడుకున్న‌ది. పెద్ద వాళ్లు వెళ్లిపోవ‌డం ఈజీనే.. కానీ, చిన్న చిన్న వాళ్లు వెళ్ల‌డం అన్న‌ది క‌ష్టం. అక్క‌డ కొత్త ఇండ‌స్ట్రీ పెట్టాల‌న్నా స‌మ‌స్య‌లుంటాయి. అయితే ఒక కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటు గురించి చ‌ర్చ‌లు సాగుతున్నాయి. దీనిపై ఇంకా నాకు పూర్తిగా తెలీదు`` అని అన్నారు. వైజాగ్‌ లో కాదు అమ‌రావ‌తిలో అంటూ ముర‌ళిమోహ‌న్ మ‌రోసారి కొత్త టాలీవుడ్ ఏర్పాటుపై కన్ ఫ్యూజ్ చేయ‌డంపై ఫిలిం మీడియాలోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వైజాగ్ - అర‌కులో వాతావ‌ర‌ణం అద్భుతంగా ఉంటుంది. విజ‌య‌వాడ‌-అమ‌రావ‌తితో పోలిస్తే వైజాగ్‌ లో చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉంటుంది. ఆ కోణంలోనూ ప్ర‌భుత్వ పెద్ద‌లు - సినీపెద్ద‌లు ఆలోచించారు అని తెలిపారు. ఇప్ప‌టికి ఇంకా స్ప‌ష్ట‌త లేదు. నాకు పూర్తిగా తెలీదు.. అని ముర‌ళీమోహ‌న్ అస్ప‌ష్టంగానే చెప్ప‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే వైజాగ్‌ లో ఏవీఎం స్టూడియోస్ - బాల‌కృష్ణ ఫిలిం స్టూడియో అంటూ బెజ‌వాడ సాక్షిగా విజ‌య‌వాడ ఎఫ్‌ డీసీ కార్యాల‌యం నుంచి ఉత్త ప్ర‌క‌ట‌నే వెలువ‌డిందా?  పైకి వైజాగ్ అని చెబుతూనే, అమ‌రావ‌తిలో కొత్త ఫిలిం ఇండ‌స్ట్రీని ఏర్పాటు చేస్తున్నారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News