సంగీత దర్శకుడు రఘు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర నుండి వెండి తెర వరకు ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించిన రఘు కుంచె త్వరలో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. 'పలాస 1978' చిత్రంలో రఘు విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ విషయం చాలా రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆ చిత్రంలోని రఘు కుంచెకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. రఘు కుంచె లుక్ చాలా బాగుందనే టాక్ వస్తుంది.
విలన్ గా చాలా పవర్ ఫుల్ గా రఘు కనిపిస్తున్నాడని.. భయంకరమైన లుక్ తో రఘు నటుడిగా కూడా గుర్తింపు దక్కించుకుంటాడేమో అంటూ ఈ లుక్ కు కామెంట్స్ వస్తున్నాయి. యాంకర్ గా.. గాయకుడిగా.. సంగీత దర్శకుడిగా పలు రంగాల్లో మెప్పించిన రఘు కుంచె నటుడిగా అదికూడా విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విలనిజంను చూపించి నటుడిగా రఘు ఫుల్ టైం నటుడిగా మిగిలి పోతాడేమో చూడాలి.
'పలాస 1978' చిత్రంకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా రోజుల క్రితం 'ద్రోణ' చిత్రంతో ఈయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రాజమౌళి శిష్యుడు అవ్వడంతో ఈయనపై అప్పట్లో చాలా అంచనాలు పెరిగాయి. అయితే ద్రోణ చిత్రం తర్వాత కరుణ కుమార్ ను ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఆయన కూడా ఇన్నాళ్లు డైరెక్షన్ కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు విభిన్నమైన పీరియాడిక్ కథాంశంతో 'పలాస 1978' చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. సినిమా ఆరంభం నుండి కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. విభిన్నంగా ఉండి ఆకట్టుకుంటుందనే నమ్మకంతో సినీ జనాలు ఉన్నారు. రఘు కుంచె లుక్ రివీల్ చేయడంతో పలాస 1978 చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి.