అతని వల్లే నా కూతురు ప్రాణాలు తీసుకుంది: టీవీ నటి శ్రావణి తల్లి

Update: 2020-09-13 08:50 GMT
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. శ్రావణి ఫ్యామిలీ మెంబర్స్ మరియు సాయి అనే వ్యక్తి కొట్టడం వల్లే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు దేవరాజ్ తన దగ్గరున్న ఆడియోలను పోలీసులకు అందించాడు. మరోవైపు దేవరాజ్‌ బ్లాక్‌ మెయిల్ చేయడం వలనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు మరియు సాయి ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శ్రావణి తల్లి పాపారత్నం ఈ విషయం పై మాట్లాడుతూ శ్రావణి చనిపోవడానికి సాయికి సంబంధం లేదని.. దేవరాజు వల్లే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రావణి తల్లి మాట్లాడుతూ ''దేవరాజు వల్లే మా అమ్మాయి శ్రావణి చనిపోయింది. సాయి మా అమ్మాయిని కొట్టింది కూడా దేవరాజ్‌ నుంచి దూరంగా ఉండాలనే. దేవరాజు తన మీద ఉన్న కేసును తీయించుకోవడానికే మా అమ్మాయితో ప్రేమ నాటకం ఆడాడు'' అని చెప్పుకొచ్చింది. ''శ్రావణి చనిపోయే ముందు బాత్ రూమ్‌ నుంచి దేవరాజ్‌ కి ఫోన్ చేసింది. అయినప్పటికీ దేవరాజు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. అందుకే శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. సాయి లేకపోతే మా కుటుంబం ఎప్పుడో చనిపోయి ఉండేది. దేవరాజ్‌ కి శ్రావణి అన్నీ తానై చూసుకుంది. సీరియల్ వాళ్లు దేవరాజుకు ఒక ఎత్తు పన్ను ఉందని.. శ్రావణి డబ్బులు పెట్టి పన్ను కట్టించింది. మా అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని గ్లామర్ పెంచుకుని దేవరాజ్‌ సీరియల్ అవకాశాలు దక్కించుకున్నాడు. మమ్మల్ని నట్టేట ముంచినాడు'' అని శ్రావణి తల్లి పాపారత్నం తెలిపారు.
Tags:    

Similar News