తమిళ్ హీరో విశాల్-మిస్కిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన `డిటెక్టివ్` తెలుగు- తమిళ్ భాషల్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని విశాల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నష్టాల్లో ఉన్న విశాల్ ఫిలిం ఫ్యాక్టరీని డిటెక్టివ్ సక్సెస్ లాభాల బాట పట్టించింది. ఒక్క హిట్ విశాల్ కు పేరుతో పాటు డబ్బును తీసుకొచ్చింది. ఆ నమ్మంతోనే ఆ సినిమాకు సీక్వెల్ గా అదే టైటిల్ తో డిటెక్టివ్ -2ని కూడా తెరకెక్కిస్తున్నారు. మిస్కిన్ సహా సేమ్ టీమ్ తోనే విశాల్ పార్ట్ -2ని కూడా ప్రారంభించాడు. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నాడు.
మిస్కిన్ పెట్టిన కండీషన్లతో పాటు..భారీగా పారితోషికం కూడా డిమాండ్ చేయడం సహా మిస్కిన్ ప్రవర్తన విధానం కూడా నచ్చలేదుట. మిస్కిన్ కారణంగా టైమ్ వేస్ట్ అవ్వడమే గాక.. మిగతా పనులన్ని డిలే అవుతున్నాయట. దీంతో విసుగు చెందిన విశాల్ `డిటెక్టివ్ -2` నుంచి మిస్కిన్ ని తప్పించినట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆ స్థానంలో విశాల్ ఎక్కి మెగా ఫోన్ పట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ తానే పూర్తి చేసి రిలీజ్ చేస్తానని టీమ్ కు తెలిపాడుట. ఎవరూ అధైర్య పడవద్దని సూచించాడుట. ఇప్పుడీ వార్త కోలీవుడ్ సహా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
విశాల్ దర్శకుల హీరో. డైరెక్టర్ల గురించి ఎంతో గొప్పగా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రియేటర్ లేకపోతే హీరో ఎలా ఉంటాడని నమ్మే వ్యక్తి. అలాంటి విశాల్ నే విసుగెత్తించాడా? అసలేం జరిగింది? అంటూ సందేహం వ్యక్తమవుతోంది. ఇక మిస్కిన్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లో ట్యాలెంటెట్ డైరెక్టర్లలలో అతనొకరు. తన సినిమాకు ప్రత్యేకమై బ్రాండ్ వ్యాల్యూ ఉంది. మరి అతన్ని కాదని విశాల్ మెగాఫోన్ పట్టాడు కాబట్టి చాలెంజింగ్ గా ప్రాజెక్ట్ పూర్తిచేయాల్సి ఉంటుంది. అలాగే తప్పక హిట్టు కొడితేనే విశాల్ పేరు నిలబడేది. విశాల్ కూడా మెగా ఫోన్ పట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇలా కాకుండా ఇలా సడెన్ గా ఛాన్స్ వస్తుందని విశాల్ కూడా ఊహించి ఉండడు.