'చిత్రలహరి' మళ్లీ హిట్ రేస్ లోకొచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మారుతితో 'ప్రతి రోజు పండగే' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు తేజ్. నెక్స్ట్ సుబ్బు అనే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే స్టార్ట్ కానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకున్నారట మేకర్స్.
'నన్ను దోచుకుందువటే' సినిమాతో పరిచయమైన నభా లేటెస్ట్ గా 'ఇస్మార్ట్ శంకర్' లో నటించి సక్సెస్ అందుకుంది. సినిమాలో నభా నటనకి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం రవితేజతో 'డిస్కో రాజా' చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత నభా నటించే సినిమా తేజ్ దే నని సమాచారం. ఈ సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే మేకర్స్ ఏరి కోరి మరీ నభాను సెలెక్ట్ చేసారని తెలుస్తుంది. ప్రస్తుతం నభా ఇస్మార్ట్ శంకర్ అందించిన ఉత్సాహంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తుంది.
శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై భోగవల్లి బాపినీడు నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసి సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత దేవకట్టా తో ఒక సినిమా - గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేయనున్నాడు తేజ్.