ఈ మధ్యకాలంలో టాక్ తో సంబంధం లేకుండా నిఖార్సైన కమర్షియల్ హిట్ ఏదయ్యా అంటే ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. జరిగిన బిజినెస్ కి కొన్న బయ్యర్లు అందరికి డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమా ఇదొక్కటే అనడంలో సందేహం అక్కర్లేదు. ఎప్పడూ సాఫ్ట్ లవర్ బాయ్ గా కనిపించే రామ్ ని ఇంత ఊర మాస్ గా చూపించడంలో పూరి చేసిన మేజిక్ బ్రహ్మాండంగా వర్క్ అవుట్ అయ్యింది. ఏ రేంజ్ లో అంటే ఇంతకు ముందు ఒప్పేసుకున్న ప్రాజెక్టులను మరోసారి పునఃసమీక్ష చేసేంత.
ఇక పూరి ట్రాక్ లోకి వచ్చేసి విజయ్ దేవరకొండతో ఫైటర్ మొదలుపెట్టబోతున్నాడు. అందరూ ఓకే కానీ హీరోయిన్లకు మాత్రం ఇస్మార్ట్ శంకర్ అంత హెల్ప్ అవుతున్నట్టు లేదు. ముఖ్యంగా మాస్ మ్యానరిజంస్ తో అలరించిన నభా నటేష్ కు ఆఫర్స్ వెల్లువెత్తుతాయి అనుకుంటే అలాంటిదేమి జరగడం లేదట. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమా రవితేజ డిస్కో రాజా ఒక్కటే. అది కూడా పాయల్ రాజ్ పుత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తోంది. సోలో అయితే కాదు.
ఇది కాకుండా ఇంకో బడ్జెట్ సినిమా ఒప్పుకుందనే టాక్ ఉంది కానీ అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ కంటే తన మాతృ బాష కన్నడ వైపే వెళ్లేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తోందని వినికిడి. అక్కడ కూడా తనకు బాగానే హిట్స్ ఉన్నాయి కానీ కెరీర్ ఆశించినంత స్పీడ్ గా వెళ్లడం లేదు. అందుకే తెలుగు మీద ఆశలు పెట్టుకుంటే పెద్ద హిట్టు దక్కినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. టైం రావాలి అంటే ఇదేనేమో. అప్పటి దాకా వేచి చూడక తప్పదు మరి