గోల్ తప్ప తనకి ఇంకేమీ లేదని భావించే కుర్రాడిని తన్ని మరీ మార్చుకుంటా! అని అంది నభా నటేష్. సుధీర్ బాబు- నభా నటేష్ జంటగా ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు నిర్మించిన సినిమా నన్ను దోచుకుందువటే. సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిట్ చాట్ లో చాలా సంగతులే చెప్పింది.
అసలీ ఛాన్సెలా వచ్చింది? అని అడిగితే.. దర్శకుడు నాయుడు నా పెర్ఫార్మెన్స్ చూసి తను రాసుకున్న కథకు నేను సరిపోతానని ఎంపిక చేసుకున్నారు. రవిబాబు దర్శకత్వంలోని అదుగో సినిమాలో అప్పటికే నటిస్తున్నా. ఆ క్రమంలోనే ఈ సినిమాకి ఎంపిక చేసుకోవడం ఆనందాన్నిచ్చింది. నన్ను దోచుకుందువటే నా తొలి తెలుగు చిత్రంగా విడుదలవుతోంది. తన పాత్ర గురించి చెబుతూ .. సరదా సరదాగా ఉండే అమ్మాయిని. విభిన్నమైన షేడ్స్ ఆకట్టుకుంటాయి. హీరో గోల్స్ గురించి తప్ప వేరే ఎవర్నీ పట్టించుకోడు. తనో పక్కా ప్రాక్టికల్ పర్సన్. అలాంటి వ్యక్తి లైఫ్ లోకి నేను ఎలా ప్రవేశించాను? తనను ఎలా మార్చాను. అన్నది తెరపైనే చూడాలి. భావోద్వేగాలు ఉండే అమ్మాయిగా కనిపిస్తాను. నా తొలి ప్రయత్నమే ఇలాంటి బలమైన పాత్ర చేసే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను... అని అంది.
కథానాయిక కాకముందు బెంగళూరు గాళ్ గా కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేశానని తెలిపింది. థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని పలు స్టేజీ షోలు చేశాను. రంగస్థల కళాకారుణిగా భిన్న పాత్రలను ఆత్మవిశ్వాసంతో చేయటానికి ఆ శిక్షణ అక్కరకొచ్చింది. నన్ను దోచుకుందువటే నా తొలి తెలుగు సినిమా. రిలీజ్ వేళ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అన్న ఉద్వేగంతో ఉన్నానని తెలిపింది. రవిబాబు అదిగో చిత్రం తొలి సినిమా అయినా - నన్ను దోచుకుందువటే ముందే రిలీజవుతోందని వెల్లడించింది.