నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన కన్నడ బ్యూటి నభా నటేష్ దర్శకేంద్రుడితో ప్రేమలో పడిపోయానని చెబుతోంది. ఈ చిత్రం సక్సెస్ కాకున్నా కూడా నభాకు మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ అమ్మడికి యూత్ లో క్రేజ్ బాగా పెరిగిపోయింది. తెలుగులో రెండు - మూడు చిత్రాల్లో నటించడానికి నభా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన నభా తాను తెలుగు అమ్మాయిని కాకపోయినా కూడా తెలుగు సినిమాలు బాగా చూసేదాన్ని అని - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంటే చాలా ఇష్టమని - ఆయన హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తాడు, అందుకే ఆయన తెరకెక్కించిన సినిమాలు చాలా చూశాను అంటూ నభా చెప్పుకొచ్చింది.
‘నన్ను దోచుకుందువటే’ చిత్రం విడుదలయ్యాక రాఘవేంద్రరావు తనని ఇంటికి పిలిచి మరీ అభినందించడం చాలా సంతోషంగా అనిపించింది అంటూ తెగ మురిసిపోతుంది. ఆ సమయంలో ఇంత బాగా ఎలా నటించావు? అని దర్శకేంద్రుడు ప్రశ్నించాడట. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారా? అని అడగగా మా కుటుంబం నుండి సినీ పరిశ్రమకు వచ్చిన మొదటి అమ్మాయిని నేనే అని చెప్పడంతో ఆయన ఇంకా అభినందించాడు అంటూ సంబరపడుతోంది.
రాఘవేంద్రరావు ‘నన్ను దోచుకుందువటే’ చిత్ర యూనిట్ అందరిని ఇంటికి పిలిచిన సమయంలో దర్శకేంద్రుడు తనని చాలా ప్రత్యేకంగా చూసుకోవడం, తన గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా ప్రతిభను గుర్తించి అభినందించడమే నాకు పెద్ద అచీవ్ మెంట్. నా తొలి చిత్రం విడుదలయిన తర్వాత నాకు ప్రేక్షకుల నుండి ప్రేమలేఖలు వస్తాయని భావించా కానీ అలాంటివి ఏమి రాలేదు. సో దర్శకేంద్రుడి అభినందనలే నాకు ప్రేమ లేఖ అంటూ నభా నటేష్ తన సంతోషాన్ని పంచుకుంది. మొత్తానికి రాఘవేంద్రరావు అభినందనలకు నభా నటేష్ ప్రేమలో పడిపోయినట్టుంది.