యాపిల్ సేవలపై కింగ్ నాగ్ ఫైర్..!

Update: 2020-12-09 14:37 GMT
ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన టెక్నాలజీ దిగ్గజం 'యాపిల్' ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలో సైతం యాపిల్ బ్రాండ్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా టాలీవుడ్‌ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున యాపిల్‌ సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపిల్‌ ఉత్పత్తులకు సంబంధించిన సేవలు ఏక పక్షంగా ఉన్నాయని.. యాపిల్‌ సేవల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ట్విటర్‌ వేదికగా నాగ్ ఫైర్ అయ్యారు.

''ఇండియాలోని యాపిల్‌ స్టోర్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేసేటప్పుడు ప్రతిఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి. వారి సేవలు, పాలసీలు ఏక పక్షంగా భయంకరంగా ఉన్నాయి'' అని కింగ్ నాగ్‌ ట్విట్టర్ లిప్ పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్ లో నాగార్జున తన ఆగ్రహానికి గల కారణాలను వెల్లడించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే నాగార్జున 'వైల్డ్ డాగ్' అనే సినిమాలో నటించాడు. అహిసోర్‌ సోల్మన్‌ దర్మకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌వర్మ అనే ఎన్‌ఐఏ ఆఫీసర్‌ గా కనిపించనున్నారు. దీనితోపాటు బాలీవుడ్‌ లో చాలా గ్యాప్ తర్వాత 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటించనున్నారు.


Tags:    

Similar News