అక్కినేని నాగచైతన్య `సవ్యసాచి` చిత్రంలో నటించాలని అనుకోలేదా? చందు మొండేటి లైన్ వినిపించగానే అసలు ఈ కాన్సెప్టులో నటిస్తే వర్కవుటవ్వడని భావించాడా? అంటే అవునని చైతూ స్వయంగా చెప్పారు. హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల్లో మీడియాతో మాట్లాడిన నాగచైతన్య .. అసలు `సవ్యసాచి` కాన్సెప్టు చందు చెప్పినట్టే తీస్తే వర్కవుటవ్వదని భావించాను. ప్రారంభం అతడు కథ చెప్పగానే కాస్త భయపడ్డాను. వద్దని అనుకున్నాను. కానీ చందు ఆ తర్వాత అన్ని కమర్షియల్ అంశాల్ని ఏర్చి కూర్చి తిరిగి కథను పూర్తి స్థాయిలో వినిపించాడు. అప్పుడు ఇక వెంటనే చేసేయాలని అనుకున్నాను.. అని చైతూ తెలిపారు. సవ్యసాచి కథను ప్రేమమ్ చిత్రీకరణలో ఉన్నప్పుడు నార్వేలో చందు తనకు చెప్పాడని అన్నారు.
సవ్యసాచిలో తన పాత్రకు లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ ఉంటుందని చెప్పినప్పుడు అసలు అలాంటి ఓ సమస్య ఉంటుందా? అని ఆ తర్వాత ఇంటర్నెట్ లో వెతికాను. ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూశాను. ఆ తరహా ఇంకెవరికైనా సమస్య ఉంటే ఆ వీడియోల్ని చూశాను. బోలెడంత సమాచారం నెట్ లోనే చూసి - చదివి తెలుసుకున్నాను.. అది తెరపై బాగా నటించేందుకు ఎంతో సహకరించిందని తెలిపారు చైతన్య. సవ్యసాచి పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలు ఉన్న ఓ చక్కని వినోదాత్మక చిత్రమని అన్నారు.
ఈ సినిమా తర్వాత నటిస్తున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ .. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమాలో వైఫ్&హజ్బెండ్ మధ్య గొడవలు హైలైట్ గా ఉంటాయి. స్వతహాగా సమంత - నేను ఒకరితో ఒకరం గొడవలు పెట్టుకోం. కానీ తెరపై మాత్రం గొడవలు పడే భార్యభర్తలుగా నటిస్తున్నాం. అందువల్ల కాస్త కష్టం అవుతోంది.. అని చైతూ అన్నారు. విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించే వెంకీమామ చిత్రం డిసెంబర్ లో ప్రారంభమవుతుందని, కంటిన్యూ షెడ్యూల్స్ ఉంటాయని తెలిపారు. సమంతతో కలిసి నటిస్తున్న సినిమా సమ్మర్ కానుకగా రిలీజవుతుందని అన్నారు.