టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచి కథల ఎంపికలో వేరియేషన్స్ చూపిస్తూ టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడీయన. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నాగశౌర్య.. తాజాగా 'కృష్ణ వ్రింద విహారి' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు అందించాడు. 'వరుడు కావలెను', 'లక్ష్య' వంటి ఫ్లాపుల తర్వాత నాగశౌర్య నటించిన చిత్రమిది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగానే ప్రమోషన్స్ చేశారు.
సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాగశౌర్య ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం పాదయాత్ర కూడా చేశాడు. ఇక సెప్టెంబర్ 23న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాగ శౌర్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
అయితే ఈ ఇంటర్వ్యూలో 'మీకు కాబోయే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు..?' అనే ప్రశ్న నాగ శౌర్య కి ఎదురైంది. అందుకు ఆయన బదులిస్తూ.. 'నాకు కాబోయే అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఆ అమ్మాయి మంచిదా..? కాదా..? అనేది తెలియాలంటే ఆమెతో ట్రావెల్ చేయాలి. వయసులో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ ఒక మెచ్యూరిటీ వచ్చాక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం లేదు' అని నాగశౌర్య చెప్పుకొచ్చాడు
ఇక ఈ క్రమంలోనే తనకు అనుష్క శెట్టి అంటే ఎంతో ఇష్టమని, ఆమెకు తాను భయంకరమైన అభిమాని అని వెల్లడించాడు. అంతేకాదు అనుష్కపై ఎప్పటికీ తన ఇష్టం పోదని, ఎంత మంది అందగత్తెలు వచ్చినా సరే ఆమెనే ఇష్టపడతానని, ఆ విషయంలో తన మనసు మారదని కూడా నాగశౌర్య పేర్కొన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.