ఓ సినిమాను తెరకెక్కించడం కంటే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కష్టమైన విషయంగా భావిస్తారు మేకర్స్. అలా ఓ మూవీని ఆడియన్స్ కు పరిచయం చేసే ప్రధాన కాన్సెప్ట్.. దాని టైటిల్. పేరు విషయంలో మేకర్స్ చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. కొన్ని పేర్లు సెంటిమెంట్ నుంచి పుడతాయి.. కొన్ని పాత పాటల నుంచి పుడతాయి.. మరికొన్ని పిలుపుల నుంచి కూడా పుడుతుంటాయి.
ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న నాగశౌర్య మూవీ ఛలో. ఈ సినిమా టైటిల్ వెనుక కూడా ఓ కథ ఉందట. తమ చిత్రానికి సరైన టైటిల్ ను వెతకడంలో చాలానే కష్టపడ్డాడట నాగశౌర్య. పైగా ఈ చిత్రాన్ని నాగశౌర్య కుటుంబం స్వయంగా నిర్మించింది. అందుకే ఈజీగా జనాల నోళ్లలో నానే క్యాచీ టైటిల్ కోసం బాగానే కుస్తీ పట్టారట. ఓ సమయంలో రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీ సినిమాలోని పాటలు వింటుండగా.. 'లే ఛలో' అనే పాటకు బాగా కనెక్ట్ అయిపోయాడట నాగశౌర్య. అలా ఆ పాట నుంచి ఛలో అనే పదాన్ని తీసుకుని తమ సినిమా పేరుగా పెట్టినట్లు ఈ కుర్ర హీరో చెప్పాడు.
ఛలో మూవీకి బిజినెస్ కూడా బాగా జరిగిందని.. హిందీ శాటిలైట్ కూడా బాగా వచ్చిందని అంటున్న నాగశౌర్య.. నైజాం ఏరియాలో మాత్రం స్వంతగా రిలీజ్ చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఫిబ్రవరి చివరి వారంలో సాయి శ్రీరాం అనే కొత్త దర్శకుడు రూపొందించే సినిమాను ప్రారంభిస్తున్నాట్లు చెప్పాడు నాగశౌర్య.