మొన్నటివరకు ఒక కాంట్రోవర్సీని ఎదుర్కొన్నాడు కుర్ర హీరో. ఊహలు గుసగుసలాడే సినిమా హిట్టవ్వడంతో వరుసగా ఇతగాడి చేతిలో ఆఫర్లే ఆఫర్లు. కాని హిట్లే లేవు. అయినాసరే తన చేతిలో చాలా ఉన్నాయ్ కాబట్టి.. మనోడు ఇప్పుడు ఫోజు కొడుతూ.. గతంలో తాను చేసిన కొన్ని లో బడ్జెట్ సినిమాల ప్రమోషన్ కోసం అస్సలు సహకరించట్లేదని ఆరోపణలు వచ్చాయి. అయితే నిజంగా ఏం జరిగిందో తెలియదు కాని.. శౌర్య మాత్రం అలాంటి రూమర్లకు చెక్ పెట్టేశాడు.
మనోడు సినిమాల్లో ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలంటూ.. 2009లోనే ఫోటో ఆల్బమ్ పట్టుకొని సినిమాల వేట స్టార్టు చేశాడులే. అప్పట్లో క్రికెట్-బీర్-గాళ్స్ వంటి సినిమాల్లో సైడ్ హీరోగా.. అలాగే ''నీ జతలేక'' అనే సినిమాలో మెయిన్ హీరోగా నటించాడు. అయితే 2010 నుండి నానా కష్టాలు పడుతూ వచ్చిన ఆ సినిమాను.. ఇప్పుడు శౌర్యకు మాంచి క్రేజ్ వచ్చింది కాబట్టి.. నిర్మాత ఎట్టకేలకు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. మొన్నటివరకు మన హీరో సహకరించాడో లేదో తెలియదు కాని.. నిన్న మాత్రం ప్లాటినం డిస్కు ఫంక్షన్ కోసం కాలు కదిపాడు. మీడియాతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''2010లో మొదలెట్టాం ఈ సినిమాను. నేను స్టార్టింగ్ స్టేజీలో ఉన్నప్పుడు తీసిన సినిమా. అప్పుడు పెద్ద హిట్టవుతుందని అనుకున్నా.. ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు అవసరం'' అంటూ సెలవిచ్చాడు. లారెన్స్ దాసరి అనే నూతన దర్శకుడు తీసిన ఈ సినిమా ఆడుతుందా లేదా అనేది తరువాత విషయం.. కాని శౌర్య మాత్రం చక్కగా ప్రమోట్ చేస్తే పోయేదేముంది.. నిర్మాతలకు ఇలాంటి హీరోలేగా అవసరం.