మెగా బ్రదర్ నాగబాబు అనూహ్య పరిణామాల నడుమ `జబర్ధస్త్` షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు దిగ్విజయంగా సాగిన ఈ బుల్లితెర రియాలిటీ షో నుంచి తప్పుకునే క్రమంలో ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ షోనుంచి తప్పుకోవడానికి కేవలం పారితోషికం సమస్య ఒక్కటే కాదు.. ఎన్నో సమస్యలున్నాయని అన్నారు.
తాజాగా ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ `అంతా నా ఇష్టం` ద్వారా మూడు వీడియోలను విడుదల చేసి జబర్ధస్త్ లోటు పాట్లను ఏకిపారేశారు. తాజాగా 22 నిమిషాల నిడివితో వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో జబర్ధస్త్ ఆర్టిస్టులకు ఎదురైన సమస్యల విషయంలో ఈటీవీ యాజమాన్యం కానీ మల్లెమాల అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి కానీ సరిగా స్పందించలేదని విమర్శించారు. ఆపత్కాలంలో వ్యక్తిగతంగా పట్టించుకోని కార్పొరెట్ వ్యవస్థ అది అంటూ దుయ్యబట్టారు.
కమెడియన్ వేణుని చితక్కొట్టిన ఘటన గురించి ప్రస్థావిస్తూ అప్పుడు కూడా ఈటీవీ-శ్యాం బృందం ఆ ఆర్టిస్టుకు ఏమీ చేయలేదని నాగబాబు అన్నారు. కొన్ని ఎపిసోడ్స్ పై కోర్టులో కేసు నడుస్తోంది. దానికి మాత్రమే మల్లెమాల అధినేత సహా ఈటీవీ వర్గాలు స్పందించారని.. అలాంటి కార్పొరెట్ గొడవలు పట్టించుకున్నట్టు ఇతర విషయాలేవీ పట్టించుకోరని అన్నారు. రకరకాల దెబ్బల వల్ల ఆర్టిస్టులు టీమ్ లీడర్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే తాను అండగా నిలిచానని.. కలిసి పోరాడదామని అన్నానని నాగబాబు వెల్లడించారు. ఎవరో మనోభావాలు దెబ్బతింటాయని సైలెంట్‌గా ఉండాలా? లీగల్‌గా సమస్యలు వస్తే కోర్టులు ఉన్నాయి కదా. ఛానల్ సమస్యల్ని డీల్ చేస్తారు.. వ్యక్తిగతంగా పట్టించుకోరు.. అంటూ ఫైరయ్యారు.
షోలో నవ్వడానికే కాదు .. మీరు లేకపోతే అది నడవదు అని అభిమానం చూపారు. కానీ నేను లేకపోయినా వ్యవస్థ కొనసాగుతుందని నాగబాబు అన్నారు. తాను షో ఆర్టిస్టుల మధ్య టీమ్ లీడర్ల మధ్య స్పిరిట్ ని నెలకొల్పేందుకు చాలా చేశానని అయితే అది మల్లెమాల అధినేతకు కూడా తెలియదని వెల్లడించారు.
జబర్ధస్త్ పై కార్పొరెట్ ఇంపాక్ట్ పడడంతో ట్యాలెంటు సంస్థను వదిలి వెల్లిందని విమర్శించారు. ఇక ఇంత పెద్ద షోలో నిర్మాణ విలువలు దారుణంగా ఉండేవని.. జబర్దస్త్‌లో పనిచేసేవాళ్లు మల్లెమాల బాగుకోసమే కష్టపడినా.. ఎవరి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. టీం ఆర్టిస్టులకు నిర్వాహకులకు మధ్య దళారులు ఉన్నారు. వాళ్ల వల్ల చాలా విషయాలు శ్యామ్ ప్రసాద్ కి తెలిసేవి కాదు. ఇవన్నీ శ్యామ్ కి తెలియదు అనే నేను అనుకుంటున్నా.. తెలిసి జరిగితే నేను ఏం చేయలేనని అన్నారు. నన్ను బాగానే చూసుకున్నారు కాని మిగతా టీం వాళ్లకు ఫుడ్ కూడా సరిగా పెట్టేవారు కాదు అని తీవ్రంగానే విమర్శించారు.
Full View