జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు మరోసారి టీడీపీని టార్గెట్ చేశారు. సీనియర్ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలు మరువకముందే నాగబాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీపైనా.. ఆ పార్టీ నేతలపైనా వరుసగా వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వచ్చాడు. ''ఒక్కటి మాత్రం నిజం తదుపరి ఎన్నికల తర్వాత వైసీపీ, జనసేన, బీజేపీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని.. అయితే టీడీపీ మాత్రం కచ్చితంగా అధికారంలోకి రాదనేది తన నమ్మకమని'' అన్నారు. ''ఎందుకంటే టీడీపీ హయాంలో ఏపీలో ప్రజలకి ఊడబోడిచింది ఏమీలేదు. డెవలప్మెంట్ అంతా అనుకుల టీవీల్లోను, పత్రికల్లోనే కనబడేది తప్ప నిజంగా చేసింది చాలా తక్కువ గ్రౌండ్ లో కనిపించింది తక్కువ'' అని ఎద్దేవా చేశారు. ''దానికి తోడు కరెప్షన్ ఇసుక మాఫియా కాల్ మనీ అబ్బో ఇంకా చాలా వున్నాయి. ఈ ట్విట్టర్ ఏం సరిపోతోంది. లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు. అందుకే ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి. ఇక నెక్స్ట్ మేమే వస్తాం మాదే రాజ్యం లాంటి భ్రమలోంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలో జీవిస్తాం అంటే వారిని స్వాగతిస్తున్నాం. కాకపోతే మానసిక శాస్త్రంలో అలాంటి పరిస్థితిని హెల్యూజినేషన్స్ అని అంటారని... ఆల్ ది బెస్ట్ ఫర్ హెల్యూజినేషన్స్'' అని సెటైరికల్ ట్వీట్ చేశారు నాగబాబు. దీనిపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్స్ ఏపీ రాజకీయాల్లో రచ్చకు దారితీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఈ ట్వీట్లతో పర్సనల్ అంటూనే పొలిటికల్ వార్ స్టార్ట్ చేసినట్లేగా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ట్వీట్స్ కూడా బాలయ్య మీద కోపంతోనే వేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి అన్ని ఇయర్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ట్రావెల్ చేసాడు కదా.. అప్పుడు ఈ కరెప్షన్ సాండ్ మాఫియా గుర్తుకు రాలేదా.. అప్పుడు టీడీపీ అవినీతి గురించి మీ తమ్ముడికి ఎందుకు చెప్పలేదు అని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే మీరు ఊహాలోకం నుండి బయటకి రావాలని.. ఘోరంగా ఓడిపోవటం అంటే పార్టీ అధినేత కూడ ఓడిపోవడం.. ఎంపీగా పోటీ చేసి డిపాజిట్స్ కూడా తెచ్చుకోకపోవడం అని టీడీపీ సపోర్టర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'నాగబాబు వ్యాఖ్యలు ఆయన పర్సనల్.. పార్టీకి సంభందం లేదు' అని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడేమో అని ఎద్దేవా చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో బాలయ్య మీద ఉన్న కోపాన్ని ఇలా పొలిటికల్ గా టీడీపీ మీదకి మళ్లిస్తున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగబాబు ట్వీట్స్ పై టీడీపీ వారు ఎలా స్పందిస్తారో ఎలాంటి చర్చలకు దారితీస్తాయో చూడాలి.