టాలీవుడ్ కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' తర్వాత చేయబోతున్న సినిమా ఏంటి అనే విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. ఆ మధ్య 'గాడ్ ఫాదర్' దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'ధమాకా' చిత్ర రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో సినిమా రాబోతుందనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ ఇప్పటికే నాగార్జున హీరోగా ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయ్యిందట. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా ముగిసింది అంటూ ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను రివీల్ చేసేందుకు గాను యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
నాగార్జున.. ప్రసన్న కుమార్ బెజవాడ కాంబోలో రూపొందుతున్న సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట. అంతే కాకుండా సినిమా యొక్క టైటిల్ ను కూడా ఉగాది సందర్భంగా రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.
మలయాళం హిట్ మూవీ 'పొరింజు మరియం జోస్' కి ఈ సినిమా రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై కూడా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కాబోతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.