నాగార్జున కార్తీ మల్టీ స్టారర్ గా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పేరు ఊపిరి అంటూ.. అప్పుడెప్పుడో దసరాకి ముందు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఫుల్లుగా రంగుల్లో నిండిపోయిన పోస్టర్లో.. నాగ్ కుర్చీపై కూర్చుని నవ్వుతూ ఉంటాడు.
ఫ్రెంచ్ మూవీ ఇన్ టచబుల్స్ స్ఫూర్తితో.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఊపిరి తెరకెక్కుతోంది. యాక్చువల్ గా దసరా వరకు ఉన్న అప్ డేట్ ప్రకారం చూసినా.. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిపోవాలి. ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సంగతులు పంచుకుంటున్న నాగ్.. అసలు ఊపిరి విషయాలు ఎత్తడం లేదు. దీనికి కారణం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ్ కుర్చీకే పరిమితమైన కేరక్టర్ చేస్తున్నాడు. దీంతో చాలా విషయాల్లో పట్టుదలగా ఉంటున్నాడు. షూట్ చేసిన పార్ట్ వరకూ ఔట్ పుట్ నాగ్ కి నచ్చకపోవడంతో.. రీషూట్ చేయాల్సిందే అంటున్నాడట.
ఇలా నాగ్ కి నచ్చేవరకూ రీషూట్స్ చేసుకుంటూ పోతుండడంతో.. అసలు ఎప్పటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందో తెలియడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఊపిరి టీం.. ఈ నెల 21న కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ అయినా.. నాగ్ కి సంతృప్తి కలిగించేలా ఉండాలని.. డైరక్టర్ కోరుకుంటున్నాడని టాక్. అయితే.. ఇలా రీ షూట్స్ చేసుకుంటూ పోతుంటే.. ఎప్పటికి ఇది కంప్లీట్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.