టాలీవుడ్ మామకోడళ్లు అని అనగానే వెంటనే గుర్తొచ్చేది అక్కినేని నాగార్జున.. సమంత. నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకున్న సమంత అక్కినేని వారి కోడలిగా అడుగుపెట్టి అటు ఫ్యామిలీని ఇటు కెరీర్ ని బ్యాలన్స్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం కరోనా డేస్ లో ఇంటికే పరిమితమైన సమంత ఇంట్లోనే కూరగాయలు పండిస్తూ.. యోగా చేస్తూ.. వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హస్బెండ్ చైతూ మరియు తన పెట్ డాగ్స్ తో కలిసి ఈ సమయాన్ని జాలీగా గడిపేస్తోంది. ఈ క్రమంలో తన మామ కింగ్ నాగార్జునతో కలిసి మొక్కలు నాటింది సమంత.
కాగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. మామ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన అక్కినేని కోడలు సమంత నాగార్జునతో కలిసి ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సమంత వెల్లడించారు.
''సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం. కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నాగ్ మామ నుండి ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాను. నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి'' అని సమంత పేర్కొన్నారు. అంతేకాకుండా 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'ని కొనసాగించవలసిందిగా హీరోయిన్స్ కీర్తి సురేశ్, రష్మిక మందన్నలు మరియు శిల్పారెడ్డిని నామినేట్ చేసింది.