న్యాచురల్ స్టార్ నాని నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అంటే..సుందరానికీ!'. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ మూవీని నిర్మించగా.. వివేక్ సాగర్ స్వరాలు అందించారు. భారీ అంచనాల నడుమ జూన్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీకెండ్ వరకు మంచి ఫ్లో చూపించిన ఈ చిత్రం.. వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగానే వీక్ అయిపోయింది. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. ఇప్పటి వరకు రూ. 18.91 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టింది. టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే భారీ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.
దీంతో నాని ఖాతాలో మరో ఫ్లాప్ ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే.. 'అంటే..సుందరానికీ!' ఎఫెక్ట్ నాని తదుపరి చిత్రమైన 'దసరా'పై గట్టిగా పడనుందంటూ తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ నటిస్తోంది. సముద్ర ఖని, జరీనా వాహెబ్, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తెలంగాణలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాని తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరియు తొలిసారి పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
అయితే నాని నటించిన తాజా చిత్రం 'అంటే..సుందరానికీ' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో.. 'దసరా' మేకర్స్ ఆలోచనలో పడ్డారట. సినిమా బడ్జెట్ లో ఓ ఇరవై శాతం తగ్గిస్తే మంచిదని నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
నిజానికి 'దసరా' నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా. కానీ, 'అంటే..' ఫ్లాప్ దిశగా దూసుకుపోతుండటంతో.. నాని మార్కెట్ డల్ అయ్యే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. అందుకే 'దసరా' బడ్జెట్ కు కోత వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.