నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం `అ!`. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాతగా నానీకి.. దర్శకుడిగా ప్రశాంత్ కి చక్కని పేరు తెచ్చింది. జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రమిది. ఫిలింఫేర్- ఐఫా- జీ అవార్డుల్ని గెలుచుకుని అన్ని వేదికలపైనా దర్శకనిర్మాతల పేరు నిలబెట్టింది. అలాంటి గ్రేట్ మూవీకి సీక్వెల్ విషయంలో డైలమా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈపాటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన సీక్వెల్ ఎందుకనో అంతకంతకు ఆలస్యమవుతోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ అ! సీక్వెల్ కథను రెడీ చేశారు. అయితే ప్రస్తుతం నిర్మాత కోసం సెర్చింగ్ తోనే జాప్యం జరుగుతోందట. సీక్వెల్ ని నాని ఎందుకని నిర్మించడం లేదు? అంటే అందుకు ఓ షాకింగ్ రీజన్ తెలిసింది. అ! చిత్రీకరణలో ఉండగానే నిర్మాత నానీతో ప్రశాంత్ వర్మకు క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయట. సరైన సమయంలో చిత్రీకరణ పూర్తి చేయడంలో ప్రశాంత్ విఫలమయ్యాడని .. చివరి నిమిషం వరకూ నాని టెన్షన్ కి గురయ్యాడని తెలుస్తోంది. తొలి నుంచి నానీకి దర్శకుడితో పొసగనే లేదని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు నానీ ఈ సీక్వెల్ ని లైట్ తీస్కున్నాడట. అందువల్లనే ప్రశాంత్ వేరొక నిర్మాతను వెతుక్కునే పనిలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అ! చిత్రంతో అవార్డ్ సినిమా దర్శకుడిగా పేరొచ్చినా కమర్షియల్ గా రాబట్టింది అంతంత మాత్రమే. ఆ తర్వాత తెరకెక్కించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది. దీంతో ప్రశాంత్ కి చిక్కులు తప్పడం లేదు. అయితే ఫిలింమేకర్ గా ప్రశాంత్ స్కిల్ కి పరిశ్రమలో గుర్తింపు ఉంది. మరి సీక్వెల్ చిత్రానికి నిర్మాత దొరికేదెలా? అన్నది చూడాలి.