యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా #NC22 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
NC22 సినిమాలో పలువురు పాపులర్ స్టార్స్ - అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల బృందం భాగం అవుతున్నారు. నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు శుక్రవారం సినిమాలోని కీలక పాత్రలలో కనిపించే నటీనటుల గురించి మేకర్స్ ప్రకటన చేశారు.
జాతీయ అవార్డు గెలుచుకున్న సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఈ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. 'రగడ' సినిమాలో కింగ్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించిన ప్రియమణి.. ఇప్పుడు తనయుడు చైతూ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న వర్సటైల్ యాక్టర్ సంపత్ రాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు చిత్ర బృందం వెల్లడించింది. అలానే ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.
సీనియర్ నటుడు అరవింద్ స్వామి NC22 సినిమాలో మెయిన్ విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'ధృవ' మూవీ తర్వాత 'రోజా' హీరో తెలుగులో విలన్ గా నటించే సినిమా ఇదే అవుతుంది.
'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ హీరో జీవా కూడా నాగచైతన్య సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైసూర్ షెడ్యూల్ లో జీవా పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.
NC22 అనేది నాగచైతన్య తమిళ్ డెబ్యూ. అలానే కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుకి తొలి తెలుగు చిత్రం. తెలుగు తమిళంలో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రం కోసం రెండు భాషల్లో పరిచయమైన ముఖాలను తీసుకున్నట్లు కాస్టింగ్ చూస్తే అర్థమవుతుంది.
ఫ్యాన్స్ కోరుకునే మాస్ అండ్ యాక్షన్ అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది చై కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. ఇందులో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీనికి తగ్గట్టుగా ''302'' అనే ఆసక్తికరమైన టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా మరియు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం సమకూరుస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.