ఫిబ్రవరిలో నయన్ పెళ్లి ఫిక్స్!

Update: 2021-01-05 09:30 GMT
స్టార్ హీరోయిన్ నయనతార-దర్శకుడు విఘ్నేష్ తమ లివింగ్ రిలేషన్ షిప్ ను వివాహ బంధంగా మార్చుకోబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ చివర్లోనే ఒక్కటి కాబోతున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఫిబ్రవరిలో వారిద్దరూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్-నయనతార చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి వీరి సహజీవనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వారి వివాహం గురించి గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ.. అవి నిజం కాలేదు. అయితే.. కోలీవుడ్ మీడియా ప్రకారం, విఘ్నేష్-నయన్ ఈ ఫిబ్రవరిలోనే వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారట. ఈ పెళ్లి హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందని తెలుస్తోంది.

కాగా.. ఈ వేడుక భారీగా నిర్వహించట్లేదట. కేవలం పరిమిత సంఖ్యలో బంధుమిత్రులను తమ వివాహానికి ఆహ్వానిస్తారని సమాచారం. వీరి వివాహం త్వరగా జరగాలని ఇద్దరి తల్లిదండ్రులు కోరుకుంటున్నారని, అందుకే వీరు త్వరగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. త్వ‌ర‌లోనే న‌య‌న్‌-విఘ్నేష్ క‌లిసి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

2015 తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీ ధాన్’ షూటింగ్ సందర్భంగా నయన్-విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వారి డేటింగ్ కొనసాగింది. వీరిద్దరూ కలిసి తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఫ్యాన్స్ లైక్ చేయడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘కథువాకుల రెండు కాదల్’ చిత్రానికి కలిసి పనిచేస్తున్నారు.
Tags:    

Similar News