విమానాశ్ర‌యం నుంచి హ‌డావుడిగా వెళుతూ చిక్కిన జంట‌

Update: 2020-12-24 06:22 GMT
అన్ లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా షూటింగుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీకి మ‌రోసారి సినిమా క‌ళ వ‌చ్చింది. ఆర్.ఎఫ్‌.సి స‌హా హైద‌రాబాద్ ఔట‌ర్ లో షూటింగులు జోరందుకున్నాయి. ఇక విమానాశ్ర‌యాల్లో కెమెరా క‌ళ్లు సెల‌బ్రిటీల్ని వెంబ‌డిస్తూ స్నాప్ ల‌తో విరుచుకుప‌డుతుండ‌డంతో ఎవ‌రూ దాగుడుమూత‌లు ఆడే వీళ్లేకుండా పోతోంది.

తాజాగా సౌత్ ఫేమ‌స్ ప్రేమ గువ్వ‌లు కెమెరాకి అలానే చిక్కారు మ‌రి. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి న‌యనతార హైదరాబాద్ విమానాశ్రయంలో ఇలా కెమెరా కంటికి ప‌ట్టుబ‌డ్డారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలా వడి వ‌డిగా అడుగులు వేస్తూ  కనిపించారు. ఈ జంట ఎంతో స్టైలిష్ లుక్ తో అందంగా కనిపించింది. మీడియా దృష్టిని అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఎంతో సౌకర్యవంతమైన సాధారణ దుస్తుల్లో ఈ జోడీ క‌నిపించారు.

విఘ్నేష్ శివన్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `కాతు వాకులా రేండు కాదల్` షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నారు ఈ జోడీ. న‌య‌న‌తార - విజ‌య్ సేతుప‌తి జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో స‌మంత ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే స‌మంత‌పైనా కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించార‌న్న ప్ర‌చారం సాగింది.

హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `అన్నాథే` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చిత్ర‌బృందంలో ఏడుగురు సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో హై అలెర్ట్ నెల‌కొంది. ర‌జ‌నీకాంత్ సైతం పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అన్నాథే మూవీ మేకర్స్ షూటింగ్ ప్రక్రియను నిలిపివేసిన తరువాత అంద‌రి గుండెల్లోనూ సైర‌న్ మోగింది. ఆ క్ర‌మంలోనే న‌య‌న్ - విఘ్నేష్ జంట ఇలా విమానాశ్ర‌యంలో ప్ర‌త్య‌క్ష‌మవ్వ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది.
Tags:    

Similar News