ప్రయత్నిస్తే సక్సెస్ ఎలా వస్తుందో హీరో శ్రీ విష్ణు చూపించాడు. గత కొంత కాలంగా చిన్న తరహా సినిమాల్లో నటిస్తూ యూత్ ని టార్గెట్ చేస్తోన్న ఈ హీరో పెద్దగా విజయాలను అందుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఇది అందరి కథ అంటూ.. నీది నాదీ ఒకే కథ అనే సినిమాతో హిట్టు కొట్టాడు. వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శాంటా టైటాస్ హీరోయిన్ గా నటించింది. మధ్య తరగతి ఫ్యామిలీ లో ఉండే కుర్రాళ్ల లైఫ్ ను చూపించి అందరిని ఎట్రాక్ట్ చేశారు. సినిమా మొత్తంగా మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చింది.
దానికి తోడు ప్రమోషన్స్ లో బాగా సక్సెస్ అయ్యింది. ఎక్కడా తగ్గకుండా ప్రతి చోట సినిమాకు హైప్ పెరిగేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. దానికి తోడు సిని ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడం చూసిన ప్రేక్షకులు కూడా పాజిటివ్ టాక్ అందించడంతో ఇన్నాళ్లకు శ్రీ విష్ణు కమర్షియల్ హిట్టు కొట్టే విధంగా దూసుకుపోతున్నాడు. సినిమా స్క్రీన్స్ పెంచడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరో 70 స్క్రీన్స్ లలో విడుదల చేయనున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. పెట్టుబడి మొత్తం దాదాపు వెనక్కి వచ్చేసింది. ఇక వచ్చేవన్నీ లాభాలే.
మొత్తంగా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.1.90cr కెలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ లో 30 లక్షలు రాబట్టిన ఈ సినిమా ఏపీ తెలంగాణ లో రూ.1.60cr వరకు అందుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ 40 లక్షలకు అమ్ముడు పోగా ఇంకా శాటిలైట్ హక్కులు మిగిలి ఉన్నాయి. సినిమా కలెక్షన్స్ ఇలానే కొనసాగితే ఆ రేట్ పెరగవచ్చు. నీది నాదీ ఒకే కథ సినిమా బడ్జెట్ రూ.2.25 కోట్లు ప్రమోషన్స్ తో కలుపుకొని మొత్తంగా 2.30 కోట్లు ఖర్చయ్యిందట.