`బాహుబలి`తో తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసిపోవడంతో కరోనా తరువాత టాలీవుడ్ సినిమాలంటే దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ మొదలైంది. అంతే కాకుండా మన సినిమా వచ్చేస్తోందంటే ప్రతీ ఒక్కరి దృష్టిపెడుతున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు కూడా మన సినిమాల కోసం పోటీ పడుతూ భారీ మొత్తాన్ని ఆఫర్ ఇవ్వడం మొదలైంది. గతంలో టాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు జీ5, అమెజాన్ ప్రైమ్ ముందు వరుసలో నిలిచేవి.
భారీ మొత్తాలని చెల్లించి క్రేజీ సినిమాలని దక్కించుకునేవి. అయితే గత కొన్ని రోజులుగా ఈ రెండు ఓటీటీ దిగ్గజాలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ పోటీపడుతోంది. ప్రతి తెలుగు సినిమా విషయంలోనూ అడ్డు పడుతూ ఎగరేసుకుపోతోంది. గతంలో పెద్దగా తెలుగు సినిమాలపై ఆసక్తిని చూపించని నెట్ ఫ్లిక్స్ తాజాగా తన పంథాని మార్చుకుని టాలీవుడ్ సినిమా ఏది పూర్తయితే దాన్ని వెంటనే కొనేస్తూ వరుస షాకులిస్తోంది.
తమిళ, తెలుగు, హిందీ సినిమాలు, సిరీస్ లని ఎడాపెడా కొనేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్ గా విడుదలైన సినిమాల నుంచి త్వరలో రిలీజ్ కానున్న క్రేజీ సినిమాలని కూడా ఎడా పెడా కొనేస్తోంది. రీసెంట్ గా రవితేజ `ధమాకా`ని దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ప్రతీ సినిమాని కొనేస్తూ వెళుతోంది. `భోళా శంకర్`తో పాటు తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన `దసరా` మూవీ ఓటీటీ హక్కుల్ని కూడా దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే...
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `దసరా`. 90వ దశకం నేపథ్యంలో సాగే విభిన్నమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీని గోదావరి ఖని కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ తో నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ మూవీ కోసం బారు గడ్డం.. చింపిరి చుట్టు.. పక్కా డైలీ లేబర్ తరహా పాత్రలో .. డిఫరెంట్ మేకోవర్ తో నాని కనిపించిన తీరు ప్రతీ ఒక్కరినీ షాక్ గురిచేసింది.
అయితే సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు అదే గెటప్ లో వున్న నాని ఇటీవలే షూటింగ్ పూర్తయిందని ఓ వీడియో గ్లిమ్స్ ని విడుదల చేశాడు. అంతే కాకుండా గడ్డం, మీసం తీసేసి సినిమా షూటింగ్ పూర్తయిందంటూ పోస్ట్ పెట్టాడు. నాని భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. శనివారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ హ్యాండిల్ `దసరా` పోస్టర్ ని విడుదల చేసి దానికి `#NetflixPandaga` అంటూ హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్లలో రిలీజ్ అనంతరం స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ట్రెండవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.