సెలబ్రెటీ అంటే ఆడంభరాలు.. హడావుడి ఉంటుంది. అది చిన్న సెలబ్రెటీనా పెద్ద సెలబ్రెటీనా అనే విషయం పక్కన పెడితే ఎక్కువ శాతం మంది జనాల్లో తమ హోదాను చూపించుకునే ప్రయత్నం చేస్తారు. సెలబ్రెటీ హోదా వస్తే వచ్చే సంపాదనలో మెజార్టీ భాగం ఖర్చు పెట్టాల్సి వస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. కాస్ట్యూమ్స్ మొదలుకుని ప్రతి ఒక్కటి మెయింటెన్ చేయడం కోసం భారీగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాని కొందరు మాత్రం అందుకు మినహాయింపు అనిపిస్తూ ఉంటుంది. మన హీరోలు సినిమాల్లో అయినా ఏదైనా ఈవెంట్ కు వచ్చినా కూడా డ్రస్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒక స్టార్ హీరో పుష్కర కాలం క్రితమే ఒక పాయింట్ ను లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసి వేసుకుని రికార్డు సృష్టించాడు. ఇక ఇప్పుడు సినిమా కోసం విదేశాలకు వెళ్లి షాపింగ్ లు చేసే వారు చాలా మంది ఉన్నారు.
హీరో అంటే ఆడంబరాలు మనం చూస్తూ ఉంటాం. కాని తమిళ హీరో ధనుష్ మాత్రం సింప్లిసిటీకి మారు పేరు అన్నట్లుగా ఉంటాడు. అతడు ఏ కార్యక్రమంలో హాజరు అయినా కూడా చాలా సింపుల్ గా హాజరు అవుతాడు. అంతర్జాతీయ సినిమాల్లో నటించినా కూడా ఆయన ఒకే తరహా లో సింపుల్ గా ఉండటం ఆయనకే చెల్లింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సెలబ్రెటీగా ధనుష్ ఎప్పుడు కూడా హైఫై అన్నట్లుగా ఉండడు అంటూ తమిళ మీడియా వర్గాల వారు అంటూ ఉంటారు. ఒక సినిమా లో నటించినప్పుడు ఆయన కాస్ట్యూమ్స్ ఖర్చు 10 లక్షల రూపాయల లోపు ఉంటుందట. ఇటీవల ఆయన పూర్తి చేసిన సినిమాకు గాను ఆయన కాస్ట్యూమ్స్ కోసం కేవలం 7 లక్షల రూపాయలను మాత్రమే నిర్మాతతో ఖర్చు చేయించాడట. కొన్ని సినిమాలకు అంతకు తక్కువ అయిన సందర్బాలు కూడా ఉన్నాయని టాక్.
తెలుగు హీరోల విషయానికి వస్తే ఒక పెద్ద హీరో సినిమా ను తీసుకుంటే అందులో కాస్ట్యూమ్స్ ఖర్చే లక్షలకు లక్షలు ఉంటుందట. హీరోయిన్ కాస్ట్యూమ్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా హీరోలు ఖర్చు చేయిస్తూ ఉంటారు. పాతిక లక్షలు మొదలుకుని కోటి రూపాయలు కూడా పెద్ద హీరోలు ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. క్వాలిటీ.. బ్రాండ్ స్పెషల్ డిజైన్ అంటూ నిర్మాతలను హీరోలు మరియు వారి కాస్ట్యూమ్స్ డిజైనర్ లు పట్టి పీల్చుకు తింటున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో నిర్మాతల శ్రేయస్సు కోసం అయినా మన తెలుగు హీరోలు కాస్ట్యూమ్స్ విషయంలో ధనుష్ ను చూసి నేర్చుకుంటే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తమిళంలో స్టార్ హీరో అయిన ధనుష్ తనను తాను నిరూపించుకునేందుకు ఇప్పటికే హిందీలో పలు సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు తెలుగు లో నటించేందుకు సిద్దం అయ్యాడు. సర్ అనే టైటిల్ తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్నాడు. ధనుష్ తరహా లోనే సింప్లిసిటీని మెయింటెన్ చేస్తే ఖచ్చితంగా నిర్మాతలకు కొంతలో కొంత అయినా భారం తగ్గించినట్లు అవుతుందనే ఆలోచన తెలుగు హీరోల్లో రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.