ట్రిపుల్ ఆర్. భారతీయ చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ అవైటింగ్ మూవీ. ఆల్ ఇండియా లెవెల్ లో పూనకం తెప్పించే మూవీ. వేయి కాదు, కోటి కళ్ళతో జనాలు ఆశగా ఎదురుచూస్తున్నఈ మూవీ జనవరి 7న రిలీజ్ అంటూ డేట్ ఫిక్స్ చేశాక నాటి నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. నిజానికి ట్రిపుల్ ఆర్ డేట్ ఫిక్స్ చేసిన నాటికి దేశమంతా ఉత్సాహపూరితమైన వాతావరణం ఉంది. అంతే కాదు నాడు ప్రపంచమంతా సేఫ్ జోన్ లో ఉంది.
అయితే డిసెంబర్ మొదలుకావడంతోనే సీన్ మొత్తం మారిపోయింది. ఒమిక్రాన్ కొత్త వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అదే టైమ్ లో భారత్ లో కూడా దాని ప్రభావాన్ని చాటుకుంటోంది. దాంతో దేశంలో ఒక్కో రాష్ట్రం ఒమిక్రాన్ ప్రభావంతో ఆంక్షలు పెట్టుకుంటూ పోతున్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ రిలీజ్ డౌటే అని అంతా అనుకుంటున్న వేళ చివరికి అదే జరిగింది.
నిజానికి ట్రిపుల్ ఆర్ కధ ఇప్పటిది కాదు, 2018లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పటికి మూడేళ్లు దాటిపోయింది అన్న మాట. 2018 లో స్టార్ట్ చేసి రోజుకు వేయి మంది ఆర్టిస్టులతో యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. అల ఎన్నో షెడ్యూల్స్, ఎన్నో నెలలు అలాగే ప్రతీదీ లావిష్ గానే తీశారు. ఎక్కడా రాజీ పడకుండా సాగిన ఈ మూవీ షూటింగ్ కి కరోనా రెండు దశలూ ఆటంకం కలిగించాయి. అయితే అన్ని అడ్డంకులను దాటుకుంటూ ట్రిపుల్ ఆర్ షూటింగ్ కి ఎట్టకేలకు గుమ్మడి కాయ కొట్టింది 2021 ప్రధమార్ధంలో.
ఆ తరువాత కరోనా తగ్గుముఖం పట్టింది. దాంతో దసరాకు మూవీ రిలీజ్ అనుకున్నారు. అయితే ఏపీలో ఫిఫ్టీ పెర్సెంట్ ఆక్యుపేషన్, టికెట్ల రేట్ల తకరారు ఉండడం వల్లనో మరే కారణం చేతనో దసరా బరి నుంచి తప్పుకున్నారు. అపుడే కొత్త ఏడాది సంక్రాంతి అనుకున్నారు. అలా మూడు నెలల ముందు ఫిక్స్ అయిన ఈ ముహూర్తం కూడా ఇపుడు కాదు అనిపించుకుని వాయిదా పడిపోయింది.
టాలీవుడ్ చరిత్రలో ఇంతలా వాయిదాల మీద వాయిదాలు పడిన మూవీ ఏదైనా ఉందా అన్నదే ఇపుడు చర్చ. నిజానికి కరోనా లేకుండా ఉంటే ట్రిపుల్ ఆర్ మొదట రిలీజ్ డేట్ 2020 జూలై 30. ఆ తరువాత 2021 సంక్రాంతి, ఆ మీదట సమ్మర్ అని కూడా అనుకున్నారు. ఇక 2021 అక్టోబర్ 13 అన్న డేట్ కూడా ఇచ్చేశారు. ఇపుడు జనవరి 2022 ఏడు అని ఫిక్స్ అయి వెనక్కి వెళ్లారు. మళ్లీ కొత్త డేట్ అంటున్నారు.
ఈ కరోనా సమస్య అలాగే ఉంది. సమ్మర్ కి అయినా అది వీడుతుందా అన్నది చూడాలి, మరో వైపు ట్రిపుల్ ఆర్ వల్ల అనేక సినిమాలు కూడా సఫర్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తూంటే ట్రిపుల్ ఆర్ ముహూర్తం మీద కూడా చర్చ సాగుతోంది. ఇంతకీ కళ్ళు కాయలు మాత్రమే కాదు, పండ్లే కాస్తున్నట్లుగా వెయిటింగ్ లో పెడుతున్న ట్రిపుల్ ఆర్ ఎపుడు అన్నదే కరడు కట్టిన ఫ్యాన్స్ తో పాటు కామన్ అడియన్ ప్రశ్న గా ఉంది.