టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీ - తమిళ్ భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలానే తమిళ్ లో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తూ 'ఆదిత్య వర్మ' పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. అయితే నిజానికి 'ఆదిత్య వర్మ' కంటే ముందు ఈ చిత్రాన్ని 'వర్మ' పేరుతో రీమేక్ చేశారు. విక్రమ్ తో 'శివపుత్రుడు' వంటి సినిమాని తీసిన స్టార్ డైరెక్టర్ బాలా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అయితే ఫైనల్ వర్షన్ చూసిన మేకర్స్ మరియు చియాన్ విక్రమ్.. సినిమాపై పెదవి విరిచారు. వెంటనే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సినిమా అవుట్ ఫుట్ అనుకున్నట్లు రాలేదని.. అందుకే హీరోని తప్ప మిగతా నటీనటులు సాకేతిక నిపుణులు అందరిని మార్చేసి మళ్ళీ షూట్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో 'అర్జున్ రెడ్డి' డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన గిరీశయ్య దర్శకత్వంలో ''ఆదిత్య వర్మ'' ని తెరకెక్కించారు. దీంతో రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్న డైరెక్టర్ బాలా సినిమా అవుట్ ఫుట్ బాగాలేకపోవడం ఏంటని అందరూ చర్చించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాలా వెర్షన్ 'వర్మ' ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయింది.
ఒకే సినిమా రెండు వెర్షన్స్ ని విడుదల చేయడం ఇదే మొదటిసారి అని చెప్పుకున్నారు. అయితే బాలా ''వర్మ'' సినిమాకి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినీ విశ్లేషకులు బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. నిన్న మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి నెటిజన్స్ 'వర్మ' సినిమాపై మీమ్స్ క్రియేట్ చేసి తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనందుకు చియాన్ విక్రమ్ కి 'ఫాదర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ఇవ్వొచ్చని కామెంట్స్ పెడుతున్నారు. సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా బాగాలేదని.. విక్రమ్ కొడుకుని హీరోగా లాంఛ్ చేయడానికి బాలా బలవంతంగానే ఈ రీమేక్ ని డైరెక్ట్ చేసి ఉంటాడని అంటున్నారు. అయితే ధృవ్ విక్రమ్ యాక్టింగ్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బాలా కు ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమాగా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత బాలా నుంచి మరో సినిమా రాలేదు.